Cholera Oral Vaccine: కలరాకి చుక్కల మందు, ఆమోదం తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

 Cholera New Oral Vaccine: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కలరా కొత్త వ్యాక్సిన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉండగా ఇప్పుడు oral vaccine కి అనుమతినిచ్చింది. అంటే కలరాకి చుక్కల మందు (Oral Vaccine For Cholera) అందుబాటులోకి రానుంది. WHO వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఓరల్ వ్యాక్సిన్‌ Euvichol-S తయారీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ల ఫార్ములానే ఉపయోగించారు. వీలైనంత వేగంగా వీటి ఉత్పత్తిని పెంచాలని చూస్తోంది WHO.సౌత్‌ కొరియాకి చెందిన EuBiologicals Co. Ltd సంస్థ ఈ చుక్కల మందుని తయారు చేసింది. Euvichol-Sతో పాటుగా Euvichol, Euvichol-Plus కి కూడా త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలపనుంది. ఇవి కూడా కలరాను కట్టడి చేసేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లే. కలరాకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఇది మూడో రకం అని వైద్యులు వెల్లడించారు.  "వ్యాక్సిన్‌ల ద్వారా కలరాని చాలా వేగంగా అడ్డుకోడానికి వీలుంటుంది. కట్టడి చేయాలని చూస్తున్నా చాలా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌లు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉండడం లేదు. ఈ కొరత కారణంగానే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వ్యాక్సిన్‌లను తీసుకురావడంతో పాటు స్వచ్ఛమైన నీళ్లు తాగడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలతో కలరా రాకుండా అడ్డుకోవచ్చు. త్వరలోనే ఈ చుక్కల మందు ఉత్పత్తిని పెంచుతాం" - ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2022లో 4 లక్షల 73 వేల కలరా కేసులు నమోదయ్యాయి. 2021తో పోల్చి చూస్తే ఇది రెట్టింపు. అయితే...2023లో ఈ కేసుల సంఖ్య కనీసం 70 వేల వరకూ అదనంగా నమోదై ఉంటాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 23 దేశాల్లో ప్రస్తుతం కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్‌ ఆఫ్ ది కాంగో, ఇథియోపియా, మొజాంబిక్, సోమాలియా, జాంబియా, జింబాబ్వేలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.  ఏంటీ ఓరల్ వ్యాక్సిన్..? Euvichol-S వ్యాక్సిన్‌ని గతేడాది డిసెంబర్‌లో తయారు చేశారు. సౌత్‌కొరియాకి చెందిన EuBiologics Co Ltd సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ని ఎగుమతి చేసేందుకు కొరియా డ్రగ్‌ సేఫ్‌టీ విభాగం గతేడాది డిసెంబర్‌లోనే అనుమతినిచ్చింది. ప్రపంచం వ్యాప్తంగా కలరా వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తున్న అతి పెద్ద సంస్థ ఇదే. అంతకు ముందే తయరా చేసిన చుక్కల మందు Euvichol-Plus కి ఇప్పుడు కొత్తగా తయారు చేసిన వ్యాక్సిన్‌ సింప్లిఫైడ్‌ ఫార్ములేషన్ అని చెబుతున్నారు సైంటిస్ట్‌లు.  కలరా ఎలా సోకుతుంది..? ఈ డయేరియల్ వ్యాధి Vibrio cholerae అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ జబ్బు చేసిన వాళ్లకు ఎలాంటి చికిత్స అందించకుండా అలా కొద్ది గంటల పాటు వదిలేస్తే వెంటనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 13-40 లక్షల కలరా కేసులు నమోదవుతున్నాయి. అందులో కనీసం 21 వేల నుంచి లక్షా 43 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కలుషిత ఆహారం, నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది.  Also Read: Doordarshan Logo: దూరదర్శన్ కొత్త లోగో వివాదాస్పదం, కాషాయ రంగుపై ప్రతిపక్షాల అసహనం

Apr 20, 2024 - 17:00
 0  1
Cholera Oral Vaccine: కలరాకి చుక్కల మందు, ఆమోదం తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

 Cholera New Oral Vaccine: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కలరా కొత్త వ్యాక్సిన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉండగా ఇప్పుడు oral vaccine కి అనుమతినిచ్చింది. అంటే కలరాకి చుక్కల మందు (Oral Vaccine For Cholera) అందుబాటులోకి రానుంది. WHO వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఓరల్ వ్యాక్సిన్‌ Euvichol-S తయారీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ల ఫార్ములానే ఉపయోగించారు. వీలైనంత వేగంగా వీటి ఉత్పత్తిని పెంచాలని చూస్తోంది WHO.సౌత్‌ కొరియాకి చెందిన EuBiologicals Co. Ltd సంస్థ ఈ చుక్కల మందుని తయారు చేసింది. Euvichol-Sతో పాటుగా Euvichol, Euvichol-Plus కి కూడా త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలపనుంది. ఇవి కూడా కలరాను కట్టడి చేసేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లే. కలరాకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఇది మూడో రకం అని వైద్యులు వెల్లడించారు. 

"వ్యాక్సిన్‌ల ద్వారా కలరాని చాలా వేగంగా అడ్డుకోడానికి వీలుంటుంది. కట్టడి చేయాలని చూస్తున్నా చాలా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌లు పెద్ద మొత్తంలో అందుబాటులో ఉండడం లేదు. ఈ కొరత కారణంగానే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వ్యాక్సిన్‌లను తీసుకురావడంతో పాటు స్వచ్ఛమైన నీళ్లు తాగడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలతో కలరా రాకుండా అడ్డుకోవచ్చు. త్వరలోనే ఈ చుక్కల మందు ఉత్పత్తిని పెంచుతాం"

- ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2022లో 4 లక్షల 73 వేల కలరా కేసులు నమోదయ్యాయి. 2021తో పోల్చి చూస్తే ఇది రెట్టింపు. అయితే...2023లో ఈ కేసుల సంఖ్య కనీసం 70 వేల వరకూ అదనంగా నమోదై ఉంటాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 23 దేశాల్లో ప్రస్తుతం కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్‌ ఆఫ్ ది కాంగో, ఇథియోపియా, మొజాంబిక్, సోమాలియా, జాంబియా, జింబాబ్వేలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 

ఏంటీ ఓరల్ వ్యాక్సిన్..?

Euvichol-S వ్యాక్సిన్‌ని గతేడాది డిసెంబర్‌లో తయారు చేశారు. సౌత్‌కొరియాకి చెందిన EuBiologics Co Ltd సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ని ఎగుమతి చేసేందుకు కొరియా డ్రగ్‌ సేఫ్‌టీ విభాగం గతేడాది డిసెంబర్‌లోనే అనుమతినిచ్చింది. ప్రపంచం వ్యాప్తంగా కలరా వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తున్న అతి పెద్ద సంస్థ ఇదే. అంతకు ముందే తయరా చేసిన చుక్కల మందు Euvichol-Plus కి ఇప్పుడు కొత్తగా తయారు చేసిన వ్యాక్సిన్‌ సింప్లిఫైడ్‌ ఫార్ములేషన్ అని చెబుతున్నారు సైంటిస్ట్‌లు. 

కలరా ఎలా సోకుతుంది..?

ఈ డయేరియల్ వ్యాధి Vibrio cholerae అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ జబ్బు చేసిన వాళ్లకు ఎలాంటి చికిత్స అందించకుండా అలా కొద్ది గంటల పాటు వదిలేస్తే వెంటనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 13-40 లక్షల కలరా కేసులు నమోదవుతున్నాయి. అందులో కనీసం 21 వేల నుంచి లక్షా 43 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కలుషిత ఆహారం, నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. 

Also Read: Doordarshan Logo: దూరదర్శన్ కొత్త లోగో వివాదాస్పదం, కాషాయ రంగుపై ప్రతిపక్షాల అసహనం

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow