Jailer Sequel: ‘జైలర్’ సీక్వెల్ కోసం టైటిల్ ఫిక్స్ - ప్రీ ప్రొడక్షన్‌కు అంతా సిద్ధం

Jailer Sequel Title Finalised: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలను ఫ్యాన్స్ ఎగబడి చూసినా.. ఆయన రేంజ్‌కు తగిన హిట్‌ను చూసి చాలాకాలం అయ్యింది. ఇక గతేడాది విడుదలయిన ‘జైలర్’ మూవీతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు సూపర్ స్టార్. ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా ఉండడంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం ‘జైలర్’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. దీని టైటిల్‌ను తాజాగా ఫిక్స్ చేశారట మేకర్స్. అదే టైటిల్.. 2023లో విడుదలయిన ‘జైలర్’.. అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. దీంతో అప్పటినుండే ప్రేక్షకుల్లో సీక్వెల్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఎన్నో రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆగస్ట్ నుండి ‘జైలర్’ సీక్వెల్‌పై దృష్టిపెట్టడం మొదలుపెట్టాడట దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం ఇంకా ఈ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ స్టేజ్‌లోనే ఉండగా.. దీని టైటిల్‌కు సంబంధించిన రూమర్స్.. రజినీకాంత్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఇక ఈ సీక్వెల్‌కు ‘హుకుమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. స్క్రిప్ట్ పూర్తయ్యింది.. ప్రస్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘జైలర్ 2’కు సంబంధించిన బేసిక్ స్క్రిప్ట్ పని పూర్తయ్యిందని తెలుస్తోంది. దీనికోసం నెల్సన్ దిలీప్‌కుమార్ అందించిన కాన్సెప్ట్‌తో టీమ్‌కు చాలా నచ్చిందని సమాచారం. టైగర్ అలియాస్ ముత్తువేల్ పాండియన్‌గా ‘జైలర్ 2’తో రజినీకాంత్‌ను మరింత కొత్తగా చూపించాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. ఇప్పటికే ఈ స్టోరీ ఐడియాను రజినీకాంత్‌కు, సన్ పిక్చర్స్‌కు వినిపించగా.. వారు కూడా నెల్సన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2024 జూన్‌లో ‘జైలర్ 2’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభిస్తారు మేకర్స్. ఇక ఈ సీక్వెల్‌ను కూడా సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుందని ఇప్పటికే స్పష్టమయ్యింది. పాటకు ఫ్యాన్స్.. త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ ఏడాది చివరిలోపు ఎలాగైనా ఈ సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం రజినీకాంత్.. లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తలైవార్ 171 షూటింగ్‌లో బిజీగా ఉండగా.. అది పూర్తయిన తర్వాత ‘జైలర్’లో కోసం సమయాన్ని కేటాయిస్తారు రజినీకాంత్. ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించానికి అనిరుధ్ అందించిన సంగీతం కూడా ఒక ముఖ్య కారణంగా నిలిచింది. ఇక అందులోని ‘హుకుమ్’ పాటను ప్రేక్షకులు రిపీట్ మోడ్‌లో విన్నారు. అందుకే ఈ సీక్వెల్‌కు ‘హుకుమ్’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేస్తే బాగుంటుందని మూవీ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Also Read: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌ ఎప్పుడో కూడా చెప్పేశారు

Apr 20, 2024 - 17:00
 0  0
Jailer Sequel: ‘జైలర్’ సీక్వెల్ కోసం టైటిల్ ఫిక్స్ - ప్రీ ప్రొడక్షన్‌కు అంతా సిద్ధం

Jailer Sequel Title Finalised: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలను ఫ్యాన్స్ ఎగబడి చూసినా.. ఆయన రేంజ్‌కు తగిన హిట్‌ను చూసి చాలాకాలం అయ్యింది. ఇక గతేడాది విడుదలయిన ‘జైలర్’ మూవీతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు సూపర్ స్టార్. ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా ఉండడంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం ‘జైలర్’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. దీని టైటిల్‌ను తాజాగా ఫిక్స్ చేశారట మేకర్స్.

అదే టైటిల్..

2023లో విడుదలయిన ‘జైలర్’.. అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. దీంతో అప్పటినుండే ప్రేక్షకుల్లో సీక్వెల్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఎన్నో రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆగస్ట్ నుండి ‘జైలర్’ సీక్వెల్‌పై దృష్టిపెట్టడం మొదలుపెట్టాడట దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం ఇంకా ఈ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ స్టేజ్‌లోనే ఉండగా.. దీని టైటిల్‌కు సంబంధించిన రూమర్స్.. రజినీకాంత్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఇక ఈ సీక్వెల్‌కు ‘హుకుమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

స్క్రిప్ట్ పూర్తయ్యింది..

ప్రస్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘జైలర్ 2’కు సంబంధించిన బేసిక్ స్క్రిప్ట్ పని పూర్తయ్యిందని తెలుస్తోంది. దీనికోసం నెల్సన్ దిలీప్‌కుమార్ అందించిన కాన్సెప్ట్‌తో టీమ్‌కు చాలా నచ్చిందని సమాచారం. టైగర్ అలియాస్ ముత్తువేల్ పాండియన్‌గా ‘జైలర్ 2’తో రజినీకాంత్‌ను మరింత కొత్తగా చూపించాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. ఇప్పటికే ఈ స్టోరీ ఐడియాను రజినీకాంత్‌కు, సన్ పిక్చర్స్‌కు వినిపించగా.. వారు కూడా నెల్సన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2024 జూన్‌లో ‘జైలర్ 2’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభిస్తారు మేకర్స్. ఇక ఈ సీక్వెల్‌ను కూడా సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుందని ఇప్పటికే స్పష్టమయ్యింది.

పాటకు ఫ్యాన్స్..

త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ ఏడాది చివరిలోపు ఎలాగైనా ఈ సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం రజినీకాంత్.. లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తలైవార్ 171 షూటింగ్‌లో బిజీగా ఉండగా.. అది పూర్తయిన తర్వాత ‘జైలర్’లో కోసం సమయాన్ని కేటాయిస్తారు రజినీకాంత్. ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించానికి అనిరుధ్ అందించిన సంగీతం కూడా ఒక ముఖ్య కారణంగా నిలిచింది. ఇక అందులోని ‘హుకుమ్’ పాటను ప్రేక్షకులు రిపీట్ మోడ్‌లో విన్నారు. అందుకే ఈ సీక్వెల్‌కు ‘హుకుమ్’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేస్తే బాగుంటుందని మూవీ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌ ఎప్పుడో కూడా చెప్పేశారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow