IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు

IPL 2024 PBKS vs MI  Mumbai Indians won:  10 ఓవర్లు 67 పరుగులకు ఆరు వికెట్లు ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌(PBKS) స్కోరు ఇది. ఇక పంజాబ్‌ ఓటమి ఖాయమని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముంబై(MI) ఆటగాళ్లు కూడా గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు. కానీ అప్పుడే ముంబైపై పంజాబ్‌ బ్యాటర్ అశుతోష్‌ శర్మ(Asutosh Sharma) పిడుగులా పడ్డాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబైకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లో ఏడు సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పేశాడు. ఇక మ్యాచ్‌ పంజాబ్‌దే అనుకున్న వేళ.... అశుతోష్‌ అవుట్‌ కావడంతో... చావు తప్పి కన్నులొట్టబోయి ముంబై గెలిచింది. కానీ ముంబై- పంజాబ్‌ మ్యాచ్‌ అభిమానులు మునివేళ్లపై నిలబెట్టింది. చివరి ఓవర్‌ వరకూ విజయం ఇరు జట్లతో దోబుచులాడింది. చివరికి ముంబై బౌలర్లు పుంజుకోవడంతో తొమ్మిది పరుగుల తేడాతో ముంబై గెలిచింది.  సూర్య, తిలక్‌ ధాటిగా.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ శామ్‌ కరణ్‌... ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్‌ను స్పిన్నర్‌ చేత వేయించిన శామ్‌ కరణ్‌... ముంబై బ్యాటర్లకు విభిన్నంగా స్వాగతం పలికాడు. తొలి రెండు ఓవర్లలో ఎలాంటి వికెట్‌ రాకపోయినా ముంబై స్కోరు 18కి చేరింది. మూడో ఓవర్‌ తొలి బంతికే ఇషాన్‌ కిషన్‌ను అవుట్‌ చేసిన పంజాబ్ స్టార్‌ పేసర్‌ రబాడ... ముంబైకు తొలి షాక్‌ ఇచ్చాడు. దీంతో 18 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం రోహిత్ శర్మతో జత కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ మరో వికెట్‌ పడకుండా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రోహిత్‌ శర్మ- సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ... 25 బంతుల్లో 2 ఫోర్లు మూడు సిక్సర్లతో 36 పరుగులు చేసి శామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 99 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ అవుటైనా సూర్యకుమార్ యాదవ్‌ ఎదురుదాడి కొనసాగించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 34 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. తర్వాత తిలక్‌ వర్మ-సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా మంచి భాగస్వామ్యమే నెలకొల్పారు. సెంచరీ దిశగా సాగుతున్న సూర్య భాయ్‌ను అవుట్‌ చేసి శామ్ కరణ్‌... ముంబైను మరో దెబ్బ తీశాడు.   53 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో సూర్యా భాయ్‌ 78 పరుగులు చేసి సూర్య పెవిలియన్‌ చేరాడు. తర్వాత తిలక్‌ వర్మ కూడా ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. కానీ ముంబై ఇండియన్స్‌ సారధి హార్దిక్‌ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు. ఆరు బంతుల్లో పది పరుగులు చేసి హార్దిక్‌... హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో తిలక్‌ వర్మ, టిమ్ డేవిడ్‌ మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 34 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో శామ్‌ కరణ్‌ 2, అర్ష్‌ పటేల్‌ 2, రబాడ ఒక వికెట్‌ తీశారు.      అశుతోష్‌ మెరుపులు 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు వణికించారు. పది పరుగుల వద్ద ప్రభుసిమ్రన్‌ సింగ్‌ను అవుట్‌ చేసిన కొయెట్జీ పంజాబ్‌ బ్యాటర్ల పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత శామ్ కరణ్‌ 6, రూసో 1, లివింగ్‌ స్టోన్‌ ఒకటి, హర్‌ ప్రీత్‌ సింగ్‌ 13, జితేశ్‌ శర్మ 9 తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో 77 పరుగులకే పంజాబ్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక పంజాబ్ ఓటమి ఖాయమని అందరూ అనుకుంటున్న వేళ మంచి ఫామ్‌లో ఉన్న అశుతోష్‌ మెరుపులు మెరిపించాడు. కేవలం  28 బంతుల్లో ఏడు సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పేశాడు. బుమ్రా బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్‌ను చూడటానికైతే రెండు కళ్లు సరిపోవు. అశుతోష్‌ పోరాటంతో పంజాబ్‌ విజయం ముంగిట నిలిచింది. ఈ దశలో కొయెట్జే మరోసారి పంజాబ్‌ను దెబ్బతీశాడు. 61 పరుగులు చేసిన అశుతోష్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన రెండు వికెట్లు కూడా నేలకూలాయి. చివర్లో రబాడ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. అయితే రబాడ రనౌట్‌ కావడంతో పంజాబ్‌ విజయానికి తొమ్మిది పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.

Apr 19, 2024 - 02:00
 0  1
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు

IPL 2024 PBKS vs MI  Mumbai Indians won:  10 ఓవర్లు 67 పరుగులకు ఆరు వికెట్లు ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌(PBKS) స్కోరు ఇది. ఇక పంజాబ్‌ ఓటమి ఖాయమని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముంబై(MI) ఆటగాళ్లు కూడా గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు. కానీ అప్పుడే ముంబైపై పంజాబ్‌ బ్యాటర్ అశుతోష్‌ శర్మ(Asutosh Sharma) పిడుగులా పడ్డాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబైకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లో ఏడు సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పేశాడు. ఇక మ్యాచ్‌ పంజాబ్‌దే అనుకున్న వేళ.... అశుతోష్‌ అవుట్‌ కావడంతో... చావు తప్పి కన్నులొట్టబోయి ముంబై గెలిచింది. కానీ ముంబై- పంజాబ్‌ మ్యాచ్‌ అభిమానులు మునివేళ్లపై నిలబెట్టింది. చివరి ఓవర్‌ వరకూ విజయం ఇరు జట్లతో దోబుచులాడింది. చివరికి ముంబై బౌలర్లు పుంజుకోవడంతో తొమ్మిది పరుగుల తేడాతో ముంబై గెలిచింది. 

సూర్య, తిలక్‌ ధాటిగా..
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ శామ్‌ కరణ్‌... ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్‌ను స్పిన్నర్‌ చేత వేయించిన శామ్‌ కరణ్‌... ముంబై బ్యాటర్లకు విభిన్నంగా స్వాగతం పలికాడు. తొలి రెండు ఓవర్లలో ఎలాంటి వికెట్‌ రాకపోయినా ముంబై స్కోరు 18కి చేరింది. మూడో ఓవర్‌ తొలి బంతికే ఇషాన్‌ కిషన్‌ను అవుట్‌ చేసిన పంజాబ్ స్టార్‌ పేసర్‌ రబాడ... ముంబైకు తొలి షాక్‌ ఇచ్చాడు. దీంతో 18 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం రోహిత్ శర్మతో జత కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ మరో వికెట్‌ పడకుండా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రోహిత్‌ శర్మ- సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ... 25 బంతుల్లో 2 ఫోర్లు మూడు సిక్సర్లతో 36 పరుగులు చేసి శామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 99 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ అవుటైనా సూర్యకుమార్ యాదవ్‌ ఎదురుదాడి కొనసాగించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 34 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. తర్వాత తిలక్‌ వర్మ-సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా మంచి భాగస్వామ్యమే నెలకొల్పారు. సెంచరీ దిశగా సాగుతున్న సూర్య భాయ్‌ను అవుట్‌ చేసి శామ్ కరణ్‌... ముంబైను మరో దెబ్బ తీశాడు.   53 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో సూర్యా భాయ్‌ 78 పరుగులు చేసి సూర్య పెవిలియన్‌ చేరాడు. తర్వాత తిలక్‌ వర్మ కూడా ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. కానీ ముంబై ఇండియన్స్‌ సారధి హార్దిక్‌ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు. ఆరు బంతుల్లో పది పరుగులు చేసి హార్దిక్‌... హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో తిలక్‌ వర్మ, టిమ్ డేవిడ్‌ మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 34 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో శామ్‌ కరణ్‌ 2, అర్ష్‌ పటేల్‌ 2, రబాడ ఒక వికెట్‌ తీశారు.   
 
అశుతోష్‌ మెరుపులు
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు వణికించారు. పది పరుగుల వద్ద ప్రభుసిమ్రన్‌ సింగ్‌ను అవుట్‌ చేసిన కొయెట్జీ పంజాబ్‌ బ్యాటర్ల పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత శామ్ కరణ్‌ 6, రూసో 1, లివింగ్‌ స్టోన్‌ ఒకటి, హర్‌ ప్రీత్‌ సింగ్‌ 13, జితేశ్‌ శర్మ 9 తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో 77 పరుగులకే పంజాబ్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక పంజాబ్ ఓటమి ఖాయమని అందరూ అనుకుంటున్న వేళ మంచి ఫామ్‌లో ఉన్న అశుతోష్‌ మెరుపులు మెరిపించాడు. కేవలం  28 బంతుల్లో ఏడు సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పేశాడు. బుమ్రా బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్‌ను చూడటానికైతే రెండు కళ్లు సరిపోవు. అశుతోష్‌ పోరాటంతో పంజాబ్‌ విజయం ముంగిట నిలిచింది. ఈ దశలో కొయెట్జే మరోసారి పంజాబ్‌ను దెబ్బతీశాడు. 61 పరుగులు చేసిన అశుతోష్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన రెండు వికెట్లు కూడా నేలకూలాయి. చివర్లో రబాడ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. అయితే రబాడ రనౌట్‌ కావడంతో పంజాబ్‌ విజయానికి తొమ్మిది పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow