Israel-Iran Conflict: డ్రోన్, మిస్సైల్ దాడుల్ని ఇక్కడితో ఆపకపోతే తీవ్ర పరిణామాలు - ఇరాన్, ఇజ్రాయెల్‌కు పోప్ ఫ్రాన్సిస్ వార్నింగ్

Iran Israel Conflict News Updates: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఈ రెండు దేశాలు తమ వివాదానికి ఇక్కడికి చెక్ పెట్టాలని, శాంతికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ఇరాన్ శనివారం (ఏప్రిల్ 13న) రాత్రి ఇజ్రాయెల్ పై దాదాపు 200 డ్రోన్లు, క్షిపణులతో దాడికి పాల్పడింది. 72 గంటల ముందే సరిహద్దు దేశాలకు దాడి గురించి సమాచారం అందించి అలర్ట్ చేశామని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుస్సేన్ అబ్దోల్లాహిన్ తెలిపారు.  మరికొన్ని దేశాల ఎంట్రీతో పెద్ద యుద్ధం ఇజ్రాయెల్ పై ఇరాన్ తాజాగా చేసిన దాడులతో మరికొన్ని దేశాలు యుద్ధం మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పోప్ ఫ్రాన్సిన్ రెండు దేశాలను శాంతికి కట్టుబడి ఉండాలని, దాడులను ఆపివేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇతర దేశాలకు ఎవరూ ముప్పుగా మారకూడదని, మిడిల్ ఈస్ట్ దేశాలకు సూచించారు. దాడులు, యుద్ధం హింసకు దారి తీస్తాయని, దాని పరిణామాలు ఊహించడం కష్టమని.. హింసను అంతం చేయాలని పిలుపునిచ్చారు. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇజ్రాయెల్‌పై దాడిని ఖండించిన డెన్నిస్ ఫ్రాన్సిస్ ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ఖండించారు. దాడులు, ప్రతిదాడులు చేసుకోవం సరికాదని 2 దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆదివారం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధానికి దారితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎన్నో మరణాలు, మరెన్నో గాయాలు, ఆస్తి నష్టం, ఎన్నో కుటుంబాలకు ఇది శాపంగా మారుతుందన్నారు. ఈ సమస్యకు చర్చలు ఏకైక మార్గం. ప్రస్తుత దాడి ఇరాన్‌ అధికారులు చెప్పి చేశారని.. తమపై జరిగిన దాడికి మాత్రమే ఇది సమాధానంగా ఇక వదిలేయాలని సూచించారు.   సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ ఇటీవల చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడికి దిగింది. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలపగా.. ఇరాన్ కు చైనా, రష్యాలు అండగా నిలిచి యుద్ధంలోకి దిగే అవకాశం ఉందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పలువురు అధికారులు చర్చలు జరిపి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. తమపై ఎవరు దాడి చేసినా దాని రెస్పాన్స్ ఇలాగే ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.

Apr 14, 2024 - 23:00
 0  12
Israel-Iran Conflict: డ్రోన్, మిస్సైల్ దాడుల్ని ఇక్కడితో ఆపకపోతే తీవ్ర పరిణామాలు - ఇరాన్, ఇజ్రాయెల్‌కు పోప్ ఫ్రాన్సిస్ వార్నింగ్

Iran Israel Conflict News Updates: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఈ రెండు దేశాలు తమ వివాదానికి ఇక్కడికి చెక్ పెట్టాలని, శాంతికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ఇరాన్ శనివారం (ఏప్రిల్ 13న) రాత్రి ఇజ్రాయెల్ పై దాదాపు 200 డ్రోన్లు, క్షిపణులతో దాడికి పాల్పడింది. 72 గంటల ముందే సరిహద్దు దేశాలకు దాడి గురించి సమాచారం అందించి అలర్ట్ చేశామని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుస్సేన్ అబ్దోల్లాహిన్ తెలిపారు. 

మరికొన్ని దేశాల ఎంట్రీతో పెద్ద యుద్ధం 
ఇజ్రాయెల్ పై ఇరాన్ తాజాగా చేసిన దాడులతో మరికొన్ని దేశాలు యుద్ధం మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పోప్ ఫ్రాన్సిన్ రెండు దేశాలను శాంతికి కట్టుబడి ఉండాలని, దాడులను ఆపివేయాలని రిక్వెస్ట్ చేశారు. ఇతర దేశాలకు ఎవరూ ముప్పుగా మారకూడదని, మిడిల్ ఈస్ట్ దేశాలకు సూచించారు. దాడులు, యుద్ధం హింసకు దారి తీస్తాయని, దాని పరిణామాలు ఊహించడం కష్టమని.. హింసను అంతం చేయాలని పిలుపునిచ్చారు. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఇజ్రాయెల్‌పై దాడిని ఖండించిన డెన్నిస్ ఫ్రాన్సిస్ 
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ఖండించారు. దాడులు, ప్రతిదాడులు చేసుకోవం సరికాదని 2 దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆదివారం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధానికి దారితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎన్నో మరణాలు, మరెన్నో గాయాలు, ఆస్తి నష్టం, ఎన్నో కుటుంబాలకు ఇది శాపంగా మారుతుందన్నారు. ఈ సమస్యకు చర్చలు ఏకైక మార్గం. ప్రస్తుత దాడి ఇరాన్‌ అధికారులు చెప్పి చేశారని.. తమపై జరిగిన దాడికి మాత్రమే ఇది సమాధానంగా ఇక వదిలేయాలని సూచించారు.  

సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ ఇటీవల చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడికి దిగింది. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలపగా.. ఇరాన్ కు చైనా, రష్యాలు అండగా నిలిచి యుద్ధంలోకి దిగే అవకాశం ఉందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పలువురు అధికారులు చర్చలు జరిపి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. తమపై ఎవరు దాడి చేసినా దాని రెస్పాన్స్ ఇలాగే ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow