RR vs KKR Match Highlights : ధోనీని ఫాలో అయ్యా కాబట్టే మ్యాచ్ గెలిపించానన్న బట్లర్- పెయిల్ అయిన గంభీర్ ప్లాన్!

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ వీరోచిత శతకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే కేవలం బౌండరీలు బాది సెంచరీ కొట్టడమే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం కాదు. అంత భారీ లక్ష్యఛేదనలో టెయిలెండర్లను కాపాడుకుంటూ ఆడిన తీరే ఆ ఇన్నింగ్స్ కు మరింత అందాన్ని చేకూర్చింది. ఆఖరి మూడు ఓవర్లలో 46 కావాల్సిన సిట్యుయేషన్ లో.... అక్కడ్నుంచి ప్రతి బాల్ తనే ఆడాడు. ఒక్క బాల్ కూడా పొరపాటున టెయిలెండర్ ను ఫేస్ చేయనివ్వలేదు.... ఎక్కడ వికెట్లు పడిపోతాయేమో అని. ప్రతి ఓవర్ ఆఖరి బాల్ కు సింగిల్ తీయడంలో విజయవంతమయ్యాడు. 18,19 ఓవర్లలో వరుసగా... 18, 19 పరుగులు వచ్చాక ఆఖరి ఓవర్ లో 9 పరుగులు కావాలి. కేకేఆర్ రసెల్ ఆర్ వరుణ్ చక్రవర్తి అనే డైలమాలో పడింది. కో-ఇన్సిడెన్స్ ఏంటంటే... వీరిద్దరూ అంతకముందు వేసిన వారి ఆఖరి ఓవర్లలో చెరో 17 పరుగులు సమర్పించుకున్నారు. సో ఇద్దరిలో ఎవరికి ఆఖరి ఓవర్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ దాదాపుగా రస్సెల్ కు ఇవ్వడానికే మొగ్గు చూపేలా కనిపించాడు. కానీ డగౌట్ నుంచి వచ్చిన సూచనలతో బాల్ వరుణ్ చక్రవర్తికి ఇచ్చారు. తొలి బాల్ కే సిక్స్ కొట్టి... మ్యాచ్ ను రాజస్థాన్ వైపు బట్లర్ తిప్పేశాడు. ఆ రకంగా వరుణ్ కు బౌలింగ్ ఇవ్వాలని డగౌట్ నుంచి గంభీర్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఇది టిపికల్ గంభీర్ స్ట్రాటజీ అనుకోవచ్చు. క్రీజులో ఉన్న భారీ హిట్టర్ కు కట్టుదిట్టమైన స్పిన్ తో కళ్లెం వేయాలనుకోవడం. కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోనీని ఎలాంటి బౌలింగ్, ఫీల్డింగ్ తో కట్టడి చేసేవాడో గుర్తుందిగా. కానీ ఈసారి మాత్రం అది ఫెయిలైంది. ఫలితంగా కేకేఆర్ సెట్ చేసిన 224 పరుగుల లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించేశాడు... జోస్ బట్లర్. అద్భుతమైన శతకాన్ని సాధించాడు. అవతలి ఎండ్ లో వికెట్లు పడుతున్నా సరే... చివరిదాకా ఉండి, హై స్కోరింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ కు విజయాన్ని కట్టబెట్టాడు. తన కెరీర్ లో ఏడో ఐపీఎల్ సెంచరీ సాధించాడు. లక్ష్యఛేదనల్లో అందరికన్నా అత్యధికంగా మూడోది. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బట్లర్‌. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నా, తన మీద తాను నమ్మకం కోల్పోకుండా ఉండటమే అసలైన టెక్నిక్ అని అన్నాడు. నిన్నటి రన్ ఛేజ్ లాంటి క్రేజీ థింగ్స్ ఐపీఎల్ లో చాలా జరిగాయన్నాడు. ధోనీ, కోహ్లీ లాంటి ఆటగాళ్లు... క్రీజులో చివరిదాకా గెలిపిస్తామనే నమ్మకంతో ఉంటారని, అది మనం చాలాసార్లు చూశామని బట్లర్ అన్నాడు. తాను కూడా అదే చేయడానికి ప్రయత్నించానని బట్లర్ మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర కూడా తనతో అదే చెప్తుంటాడని బట్లర్ గుర్తుచేసుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ఇదే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ గా భావిస్తున్నట్టు బట్లర్ చెప్పాడు.

Apr 17, 2024 - 11:00
 0  3
RR vs KKR Match Highlights : ధోనీని ఫాలో అయ్యా కాబట్టే మ్యాచ్ గెలిపించానన్న బట్లర్-  పెయిల్ అయిన గంభీర్ ప్లాన్!

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ వీరోచిత శతకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే కేవలం బౌండరీలు బాది సెంచరీ కొట్టడమే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం కాదు. అంత భారీ లక్ష్యఛేదనలో టెయిలెండర్లను కాపాడుకుంటూ ఆడిన తీరే ఆ ఇన్నింగ్స్ కు మరింత అందాన్ని చేకూర్చింది.

ఆఖరి మూడు ఓవర్లలో 46 కావాల్సిన సిట్యుయేషన్ లో.... అక్కడ్నుంచి ప్రతి బాల్ తనే ఆడాడు. ఒక్క బాల్ కూడా పొరపాటున టెయిలెండర్ ను ఫేస్ చేయనివ్వలేదు.... ఎక్కడ వికెట్లు పడిపోతాయేమో అని. ప్రతి ఓవర్ ఆఖరి బాల్ కు సింగిల్ తీయడంలో విజయవంతమయ్యాడు. 18,19 ఓవర్లలో వరుసగా... 18, 19 పరుగులు వచ్చాక ఆఖరి ఓవర్ లో 9 పరుగులు కావాలి. కేకేఆర్ రసెల్ ఆర్ వరుణ్ చక్రవర్తి అనే డైలమాలో పడింది.

కో-ఇన్సిడెన్స్ ఏంటంటే... వీరిద్దరూ అంతకముందు వేసిన వారి ఆఖరి ఓవర్లలో చెరో 17 పరుగులు సమర్పించుకున్నారు. సో ఇద్దరిలో ఎవరికి ఆఖరి ఓవర్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ దాదాపుగా రస్సెల్ కు ఇవ్వడానికే మొగ్గు చూపేలా కనిపించాడు. కానీ డగౌట్ నుంచి వచ్చిన సూచనలతో బాల్ వరుణ్ చక్రవర్తికి ఇచ్చారు. తొలి బాల్ కే సిక్స్ కొట్టి... మ్యాచ్ ను రాజస్థాన్ వైపు బట్లర్ తిప్పేశాడు.

ఆ రకంగా వరుణ్ కు బౌలింగ్ ఇవ్వాలని డగౌట్ నుంచి గంభీర్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. ఇది టిపికల్ గంభీర్ స్ట్రాటజీ అనుకోవచ్చు. క్రీజులో ఉన్న భారీ హిట్టర్ కు కట్టుదిట్టమైన స్పిన్ తో కళ్లెం వేయాలనుకోవడం. కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోనీని ఎలాంటి బౌలింగ్, ఫీల్డింగ్ తో కట్టడి చేసేవాడో గుర్తుందిగా. కానీ ఈసారి మాత్రం అది ఫెయిలైంది.

ఫలితంగా కేకేఆర్ సెట్ చేసిన 224 పరుగుల లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించేశాడు... జోస్ బట్లర్. అద్భుతమైన శతకాన్ని సాధించాడు. అవతలి ఎండ్ లో వికెట్లు పడుతున్నా సరే... చివరిదాకా ఉండి, హై స్కోరింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ కు విజయాన్ని కట్టబెట్టాడు. తన కెరీర్ లో ఏడో ఐపీఎల్ సెంచరీ సాధించాడు. లక్ష్యఛేదనల్లో అందరికన్నా అత్యధికంగా మూడోది.

మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బట్లర్‌. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నా, తన మీద తాను నమ్మకం కోల్పోకుండా ఉండటమే అసలైన టెక్నిక్ అని అన్నాడు. నిన్నటి రన్ ఛేజ్ లాంటి క్రేజీ థింగ్స్ ఐపీఎల్ లో చాలా జరిగాయన్నాడు. ధోనీ, కోహ్లీ లాంటి ఆటగాళ్లు... క్రీజులో చివరిదాకా గెలిపిస్తామనే నమ్మకంతో ఉంటారని, అది మనం చాలాసార్లు చూశామని బట్లర్ అన్నాడు.

తాను కూడా అదే చేయడానికి ప్రయత్నించానని బట్లర్ మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర కూడా తనతో అదే చెప్తుంటాడని బట్లర్ గుర్తుచేసుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్ లో ఇదే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ గా భావిస్తున్నట్టు బట్లర్ చెప్పాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow