UPSC CSE Toppers: తొలి ప్రయత్నంలోనే ‘అనన్య’ ఘనత, సొంత ప్రిపరేషన్‌తో సివిల్స్‌ ఫలితాల్లో మూడో ర్యాంకు

Civils Topper: యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో పాల‌మూరు పేరు మారుమోగింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన దోనూరు అన‌న్య రెడ్డి అసాధారణ ప్రతిభతో తొలి ప్రయ‌త్నంలోనే సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. దీంతో ఆమెకు అభినంద‌న‌లు వెలువెత్తుతున్నాయి. అడ్డాకుల మండ‌లం పొన్నక‌ల్ గ్రామానికి చెందిన అనన్య పదోతరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్‌లో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేశారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన అనన్య.. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే సొంత ప్రిపరేషన్‌తోనే ఈ ఘనతను సాధించడం విశేషం. గతేడాది కూడా తెలంగాణ‌కు చెందిన ఉమా హార‌తి మూడో ర్యాంకు సాధించడం విశేషం.  ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''డిగ్రీ చ‌దువుతున్న స‌మ‌యంలోనే సివిల్స్ మీద దృష్టి సారించాను. దీంతో రోజుకు 12 నుంచి 14 గంట‌ల పాటు క‌ష్టప‌డి చ‌దివాను. ఆంథ్రోపాల‌జీ ఆప్షన‌ల్ స‌బ్జెక్ట్‌గా ఎంచుకున్నాను. ఇందుకు హైద‌రాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని ప‌క‌డ్బందీగా చ‌దివాను. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ.. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. సామాజిక సేవ చేయాల‌నే త‌ప‌న త‌న‌లో చిన్నప‌ట్నుంచే ఉంది ఈ క్రమంలోనే సివిల్స్‌పై దృష్టి సారించి సాధించాను. త‌మ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని నేనే. నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కాగా.. అమ్మ గృహిణి'' అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరు అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 టాప్-10 ర్యాంకర్లు వీరే.. అభ్యర్థి పేరు సాధించిన ర్యాంకు ఆదిత్య శ్రీవాత్సవ 1వ ర్యాంకు  అనిమేష్ ప్రధాన్ 2వ ర్యాంకు దోనూరు అనన్యా రెడ్డి 3వ ర్యాంకు పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ 4వ ర్యాంకు రుహానీ 5వ ర్యాంకు సృష్టి దేబాస్ 6వ ర్యాంకు అనుమోల్ రాథోడ్ 7వ ర్యాంకు ఆశిష్ కుమార్ 8వ ర్యాంకు నౌసిన్ 9వ ర్యాంకు ఐశ్వర్యం ప్రజాపతి 10వ ర్యాంకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎంపికైన అభ్యర్థులు.. అభ్యర్థి పేరు సాధించిన ర్యాంకు దోనూరు అనన్యారెడ్డి 3వ ర్యాంకు మెరుగు కౌశిక్  22వ ర్యాంకు నందల సాయి కిరణ్‌ 27వ ర్యాంకు జయసింహారెడ్డి 103వ ర్యాంకు పింకిస్ ధీరజ్ రెడ్డి  173వ ర్యాంకు అక్షయ్ దీపక్  196వ ర్యాంకు భానుశ్రీ 198వ ర్యాంకు ప్రదీప్ రెడ్డి  382వ ర్యాంకు వెంకటేష్ 467వ ర్యాంకు పూల ధనుష్  480వ ర్యాంకు కె. శ్రీనివాసులు  526వ ర్యాంకు సాయితేజ 558వ ర్యాంకు సయింపు కిరణ్‌  568వ ర్యాంకు పి. భార్గవ్  590వ ర్యాంకు అర్పిత 639వ ర్యాంకు శ్యామల 649వ ర్యాంకు సాక్షి కుమార్  679వ ర్యాంకు చౌహాన్ 703వ ర్యాంకు జి.శ్వేత  711వ ర్యాంకు కోట అనిల్ కుమార్‌ 764వ ర్యాంకు ధనుంజయ్ కుమార్  810వ ర్యాంకు లక్ష్మీ భానోతు  828వ ర్యాంకు ఆదా సందీప్‌ కుమార్‌  830వ ర్యాంకు జె.రాహుల్‌  873వ ర్యాంకు హనిత వేములపాటి  887వ ర్యాంకు కె.శశికాంత్‌ 891వ ర్యాంకు కెసారపు మీనా  899వ ర్యాంకు రావూరి సాయి అలేఖ్య  938వ ర్యాంకు గోపద నవ్యశ్రీ  995వ ర్యాంకు అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసం గానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌లో సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Apr 17, 2024 - 01:00
 0  6
UPSC CSE Toppers: తొలి ప్రయత్నంలోనే ‘అనన్య’ ఘనత, సొంత ప్రిపరేషన్‌తో సివిల్స్‌ ఫలితాల్లో మూడో ర్యాంకు

Civils Topper: యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో పాల‌మూరు పేరు మారుమోగింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన దోనూరు అన‌న్య రెడ్డి అసాధారణ ప్రతిభతో తొలి ప్రయ‌త్నంలోనే సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. దీంతో ఆమెకు అభినంద‌న‌లు వెలువెత్తుతున్నాయి. అడ్డాకుల మండ‌లం పొన్నక‌ల్ గ్రామానికి చెందిన అనన్య పదోతరగతి వరకు మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్‌లో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేశారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన అనన్య.. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే సొంత ప్రిపరేషన్‌తోనే ఈ ఘనతను సాధించడం విశేషం. గతేడాది కూడా తెలంగాణ‌కు చెందిన ఉమా హార‌తి మూడో ర్యాంకు సాధించడం విశేషం. 

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''డిగ్రీ చ‌దువుతున్న స‌మ‌యంలోనే సివిల్స్ మీద దృష్టి సారించాను. దీంతో రోజుకు 12 నుంచి 14 గంట‌ల పాటు క‌ష్టప‌డి చ‌దివాను. ఆంథ్రోపాల‌జీ ఆప్షన‌ల్ స‌బ్జెక్ట్‌గా ఎంచుకున్నాను. ఇందుకు హైద‌రాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని ప‌క‌డ్బందీగా చ‌దివాను. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ.. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. సామాజిక సేవ చేయాల‌నే త‌ప‌న త‌న‌లో చిన్నప‌ట్నుంచే ఉంది ఈ క్రమంలోనే సివిల్స్‌పై దృష్టి సారించి సాధించాను. త‌మ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని నేనే. నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కాగా.. అమ్మ గృహిణి'' అని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..
సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరు అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 టాప్-10 ర్యాంకర్లు వీరే..

అభ్యర్థి పేరు సాధించిన ర్యాంకు
ఆదిత్య శ్రీవాత్సవ 1వ ర్యాంకు
 అనిమేష్ ప్రధాన్ 2వ ర్యాంకు
దోనూరు అనన్యా రెడ్డి 3వ ర్యాంకు
పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ 4వ ర్యాంకు
రుహానీ 5వ ర్యాంకు
సృష్టి దేబాస్ 6వ ర్యాంకు
అనుమోల్ రాథోడ్ 7వ ర్యాంకు
ఆశిష్ కుమార్ 8వ ర్యాంకు
నౌసిన్ 9వ ర్యాంకు
ఐశ్వర్యం ప్రజాపతి 10వ ర్యాంకు

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎంపికైన అభ్యర్థులు..

అభ్యర్థి పేరు సాధించిన ర్యాంకు
దోనూరు అనన్యారెడ్డి 3వ ర్యాంకు
మెరుగు కౌశిక్  22వ ర్యాంకు
నందల సాయి కిరణ్‌ 27వ ర్యాంకు
జయసింహారెడ్డి 103వ ర్యాంకు
పింకిస్ ధీరజ్ రెడ్డి  173వ ర్యాంకు
అక్షయ్ దీపక్  196వ ర్యాంకు
భానుశ్రీ 198వ ర్యాంకు
ప్రదీప్ రెడ్డి  382వ ర్యాంకు
వెంకటేష్ 467వ ర్యాంకు
పూల ధనుష్  480వ ర్యాంకు
కె. శ్రీనివాసులు  526వ ర్యాంకు
సాయితేజ 558వ ర్యాంకు
సయింపు కిరణ్‌  568వ ర్యాంకు
పి. భార్గవ్  590వ ర్యాంకు
అర్పిత 639వ ర్యాంకు
శ్యామల 649వ ర్యాంకు
సాక్షి కుమార్  679వ ర్యాంకు
చౌహాన్ 703వ ర్యాంకు
జి.శ్వేత  711వ ర్యాంకు
కోట అనిల్ కుమార్‌ 764వ ర్యాంకు
ధనుంజయ్ కుమార్  810వ ర్యాంకు
లక్ష్మీ భానోతు  828వ ర్యాంకు
ఆదా సందీప్‌ కుమార్‌  830వ ర్యాంకు
జె.రాహుల్‌  873వ ర్యాంకు
హనిత వేములపాటి  887వ ర్యాంకు
కె.శశికాంత్‌ 891వ ర్యాంకు
కెసారపు మీనా  899వ ర్యాంకు
రావూరి సాయి అలేఖ్య  938వ ర్యాంకు
గోపద నవ్యశ్రీ  995వ ర్యాంకు

అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసం గానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌లో సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow