పోషించే స్థోమత లేక భార్యతో పాటు ఏడుగురు పిల్లల్ని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

Pakistan Man Kills Wife: పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి తన భార్యని, 7 గురు పిల్లల్ని గొడ్డలితో నరికి చంపాడు. వాళ్లని పోషించే స్థోమత లేక ఇలా దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు ఉపాధి కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది పూట గడవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే సజ్జద్ ఖోకర్ అనే ఓ కూలీ తన భార్యతో పాటు పిల్లల్ని ఇలా చంపుకున్నాడు. పిల్లల్లో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. వీళ్లలో 8 నెలల వయసున్న చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే...నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని, అప్పులు తీర్చలేక చాలా రోజులుగా ఒత్తిడిలో ఉన్నాడని వివరించారు పోలీసులు. ఇదే విషయమై భార్యతో తరచూ గొడవ పడేవాడని స్థానికులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. నేరాన్ని అంగీకరించిన నిందితుడు ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు. వాళ్లని పోషించే స్థోమత లేదని, అందుకే చంపాననని చెప్పాడు. హత్య చేసిన తరవాత తనంతట తానుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.  దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్థిక స్థిరత్వం లేకుండా ఏ దేశమూ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని అందులో పేర్కొన్నారు. 1971 నాటి రోజులు గుర్తొస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. 

Apr 12, 2024 - 16:00
 0  12

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow