భారత్‌లో మాల్దీవ్స్ పర్యాటక శాఖ రోడ్‌ షోలు, ఇండియన్స్‌ని ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్

India Maldives Dispute: భారత్‌తో కయ్యం పెట్టుకున్న తరవాత మాల్దీవ్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. అందుకే మళ్లీ భారతీయుల్ని బుజ్జగించే పనిలో పడింది. ఈ వివాదం కొనసాగుతూ పోతే ఆర్థికంగా నష్టపోతామని భావించిన ఈ ద్వీప దేశం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే...ఇండియాలో పెద్ద ఎత్తున రోడ్‌ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇండియన్ టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు ఇలా ప్లాన్ చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేశారు. ఆ సమయంలోనే మాల్దీవ్స్ మంత్రులు కొందరు మోదీపై విమర్శలు చేశారు. ఈ కోపంతోనే భారతీయులు బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది. అప్పటి నుంచి మాల్దీవ్స్‌ ట్రిప్స్‌ని చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ దెబ్బతో ఇప్పుడు దిగొచ్చింది మాల్దీవ్స్ పర్యాటక శాఖ. ఇందులో భాగంగానే భారత్‌లో రోడ్‌ షోలు చేయనుంది. Maldives Association of Travel Agents and Tour Operators (MATATO) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్ 8వ తేదీన మాల్దీవ్స్ రాజధాని మేల్‌ సిటీలో భారత హైకమిషనర్‌తో చర్చలు జరిపిన తరవాత ఈ నిర్ణయం తీసుకుంది.  "మాల్దీవ్స్‌లో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగానే భారత్‌లోని ప్రధాన నగరాల్లో రోడ్‌ షోలు నిర్వహించనున్నాం. రానున్న రోజుల్లో మాల్దీవ్స్‌కి పెద్ద ఎత్తున భారతీయులు వచ్చేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం" - మాల్దీవ్స్ పర్యాటక శాఖ తగ్గిన పర్యాటకుల సంఖ్య మాల్దీవ్స్ టూరిజం రంగానికి భారత్ చాలా కీలకమైన మార్కెట్ అని తేల్చి చెబుతున్నారు అక్కడి అధికారులు. భారత్ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ అసోసియేషన్స్‌తో సంప్రదింపులు జరుపుతోంది. మాల్దీవ్స్ పర్యాటక శాఖ (Maldives Tourism) వెల్లడించిన వివరాల ప్రకారం...కొద్ది నెలలుగా ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2023లో 17 లక్షల మంది టూరిస్ట్‌లు మాల్దీవ్స్‌లో పర్యటించగా అందులో 2 లక్షలకుపైగా భారతీయులే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోతుండడం ఆ ద్వీప దేశాన్ని కలవర పెడుతోంది. జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించినప్పటి నుంచి అక్కడి పర్యాటక రంగానికి డిమాండ్ పెరిగింది. చాలా మంది లక్షద్వీప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ చూడదగ్గ ప్రాంతాలేంటో ఆరా తీస్తున్నారు. పర్యాటకుల నుంచి పెద్ద ఎత్తున ఎంక్వైరీలు వస్తున్నాయని లక్షద్వీప్ పర్యాటక రంగం (Lakshadweep Tourism) వెల్లడించింది. భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. లక్షద్వీప్‌కి స్పెషల్‌ ఫ్లైట్‌లూ సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో ట్రావెల్ అసోసియేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. అటు మాల్దీవ్స్‌కి ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నా వాళ్లంతా లక్షద్వీప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ ప్రధాని మోదీ పర్యటించడమే కాకుండా స్నోర్కిలింగ్ కూడా చేశారు.  Also Read: Frauds At Petrol Pumps: మీరు చూస్తుడంగానే పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న 7 రకాల మోసాలు

Apr 12, 2024 - 13:00
 0  8
భారత్‌లో మాల్దీవ్స్ పర్యాటక శాఖ రోడ్‌ షోలు, ఇండియన్స్‌ని ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్

India Maldives Dispute: భారత్‌తో కయ్యం పెట్టుకున్న తరవాత మాల్దీవ్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. అందుకే మళ్లీ భారతీయుల్ని బుజ్జగించే పనిలో పడింది. ఈ వివాదం కొనసాగుతూ పోతే ఆర్థికంగా నష్టపోతామని భావించిన ఈ ద్వీప దేశం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే...ఇండియాలో పెద్ద ఎత్తున రోడ్‌ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇండియన్ టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు ఇలా ప్లాన్ చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడి పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేశారు. ఆ సమయంలోనే మాల్దీవ్స్ మంత్రులు కొందరు మోదీపై విమర్శలు చేశారు. ఈ కోపంతోనే భారతీయులు బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది. అప్పటి నుంచి మాల్దీవ్స్‌ ట్రిప్స్‌ని చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ దెబ్బతో ఇప్పుడు దిగొచ్చింది మాల్దీవ్స్ పర్యాటక శాఖ. ఇందులో భాగంగానే భారత్‌లో రోడ్‌ షోలు చేయనుంది. Maldives Association of Travel Agents and Tour Operators (MATATO) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్ 8వ తేదీన మాల్దీవ్స్ రాజధాని మేల్‌ సిటీలో భారత హైకమిషనర్‌తో చర్చలు జరిపిన తరవాత ఈ నిర్ణయం తీసుకుంది. 

"మాల్దీవ్స్‌లో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగానే భారత్‌లోని ప్రధాన నగరాల్లో రోడ్‌ షోలు నిర్వహించనున్నాం. రానున్న రోజుల్లో మాల్దీవ్స్‌కి పెద్ద ఎత్తున భారతీయులు వచ్చేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం"

- మాల్దీవ్స్ పర్యాటక శాఖ

తగ్గిన పర్యాటకుల సంఖ్య

మాల్దీవ్స్ టూరిజం రంగానికి భారత్ చాలా కీలకమైన మార్కెట్ అని తేల్చి చెబుతున్నారు అక్కడి అధికారులు. భారత్ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ అసోసియేషన్స్‌తో సంప్రదింపులు జరుపుతోంది. మాల్దీవ్స్ పర్యాటక శాఖ (Maldives Tourism) వెల్లడించిన వివరాల ప్రకారం...కొద్ది నెలలుగా ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2023లో 17 లక్షల మంది టూరిస్ట్‌లు మాల్దీవ్స్‌లో పర్యటించగా అందులో 2 లక్షలకుపైగా భారతీయులే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోతుండడం ఆ ద్వీప దేశాన్ని కలవర పెడుతోంది. జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించినప్పటి నుంచి అక్కడి పర్యాటక రంగానికి డిమాండ్ పెరిగింది. చాలా మంది లక్షద్వీప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ చూడదగ్గ ప్రాంతాలేంటో ఆరా తీస్తున్నారు. పర్యాటకుల నుంచి పెద్ద ఎత్తున ఎంక్వైరీలు వస్తున్నాయని లక్షద్వీప్ పర్యాటక రంగం (Lakshadweep Tourism) వెల్లడించింది. భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. లక్షద్వీప్‌కి స్పెషల్‌ ఫ్లైట్‌లూ సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో ట్రావెల్ అసోసియేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. అటు మాల్దీవ్స్‌కి ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నా వాళ్లంతా లక్షద్వీప్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ ప్రధాని మోదీ పర్యటించడమే కాకుండా స్నోర్కిలింగ్ కూడా చేశారు. 

Also Read: Frauds At Petrol Pumps: మీరు చూస్తుడంగానే పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న 7 రకాల మోసాలు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow