Adhar Free Update: రేపటితో ముగియనున్న ఆధార్‌ కార్డు ఉచిత అప్డేట్ ఆప్షన్, నేడే వివరాలు నమోదు చేసుకోండి ఇలా..

5 months ago 98
ARTICLE AD

Adhar Free Update: ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గతంలో యూఐడీఏఐ అవకాశం ఇచ్చింది. అయితే ఈ గడువు 2024 మార్చి 14తో ముగిసింది.‌ దీంతో‌ గడువును యూఐడీఏఐ మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఆధార్ ఉచితంగా అప్‌డేట్ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగించింది. అంటే మరో మూడు నెలలు ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చని‌ తెలిపింది.

ఆన్‌లైన్ అప్‌డేట్ లో మాత్రమే ఉచిత ఆధార్ అప్‌డేట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్ ను అప్‌డేట్ చేసుకోవాలంటే, అప్‌డేట్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ లో ఉచిత అప్‌డేషన్ సేవ మై ఆధార్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించడానికి, స్వయంగా ఆధార్ ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి, కస్టమర్లు వారి జనాభా డేటా, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి‌ అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఆధార్ లోని అనేక జనాభా డేటాను స్వయంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. కొన్ని సేవలకు మాత్రం ఆధార్ కేంద్రానికి మాత్రమే వెళ్లాలి. ఉదాహరణకు ఐరిస్ లేదా, బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.

గత పదేళ్ల ఏళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోకపోతే, ఇప్పుడు వారు తమ ఆధార్ ని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐదేళ్లు ఏళ్లలోపు పిల్లల ఆధార్ సైతం అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాంటి వారు యూఐడీఏఐ ఇచ్చిన ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలి.

ఆధార్ కార్డును అప్‌డేట్ చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకుగాను గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ కోసం ఆన్‌లైన్ లో https://myaadhaar.uidai.gov.in పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు.

అలా కాకుండా ఆధార్ సేవా సెంటర్ల ద్వారా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే, రూ. 50 ఆపైన చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డ్‌లో ఎవరి ఫోన్ నంబర్‌ను జోడించకపోతే, వారు అప్‌డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇంట్లోనే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ ఎలా చేసుకోవాలి?

ముందుగా యూఐడీఏఐకు సంబంధించిన వ్యక్తిగత సేవ్ అప్‌డేట్ పోర్టల్ పై క్లిక్ చేయాలి. తరువాత "లాగిన్" పై క్లిక్ చేసి 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తరువాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

మీరు మీ ఆధార్ తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఓటీపీ ఎంటర్ బాక్స్ లో ఎంటర్ చేయాలి. సర్వీసెస్ ట్యాబ్ కింద 'ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం 'ప్రోసీడ్ టూ అప్‌డేట్ ఆధార్'పై క్లిక్ చేయాలి.‌ అనంతరం మీరు మార్చాలనుకుంటున్న వివరాలకు సంబంధించిన ఆప్షన్ ను ఎంచుకోవాలి.

మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. మీరు పత్రాలను అప్ లోడ్ చేయడంతో మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. మీరు చేసిన మార్పులు ఓకే అనిపిస్తే, నిర్థారించాలి. అప్పుడు మీ సమాచారం అప్‌డేట్ అవుతుంది. ఒకవేళ ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ 1947 నంబర్ ను సంప్రదించవచ్చు.

ఏమేమీ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు

పేరుచిరునామాపుట్టిన‌ తేదీ, వయస్సులింగంమొబైల్ నంబర్ఇ మెయిల్రిలేషన్ షిప్ స్టేటస్

ఆధార్ ను ఉచితంగా అప్‌డేట్ అవకాశం రేపటితో ముగుస్తుంది. ఎల్లుండి నుంచి ఆధార్ ను అప్‌డేట్ చేయాలంటే, ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Read Entire Article