Ameerpet Hostel: అమీర్‌పేట హాస్టల్లో దారుణం, కర్నూలుకు చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడి దారుణ హత్య

3 months ago 83
ARTICLE AD

Ameerpet Hostel: మద్యం మత్తులో హాస్టల్లో గొడవ చేస్తున్న యువకుడిని వారించడమే ఆ యువకుడు చేసిన పాపమైంది. తాగి గోల చేస్తుండటంతో వారించినందుకు గొడవ పడి గడ్డం గీసే కత్తితో దాడి చేయడంతో ప్రైవేట్ పాఠశాలఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు.

హాస్టల్‌ గదిలో ఉంటున్న రూమ్ మేట్‌ను బార్బర్ షాప్‌లో పనిచేసే యువకుడు మంగలి కత్తితో హతమార్చాడు. అమీర్‌పేట్‌లోని ప్రైవేటు బాయ్స్ హాస్టల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన హత్యలో నీలి వెంకటరమణ (38) అనే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు హత్యకు గురయ్యాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన నీలి వెంకటర మణ హైదరాబాద్ అమీర్‌పేటలోని ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇదే హాస్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా తంగళ్లపాడు సమీపంలో యాదవ్ నగర్‌కు చెందిన గణేశ్‌ అనే యువకుడు నెలన్నర క్రితం వెంకటరమణ ఉంటున్న గదిలో రూమ్‌మేట్‌గా చేరాడు.

గణేశ్ హాస్టల్‌కు సమీపంలోని ఓ సెలూ న్లో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన గణేష్‌.. హాస్టల్ గదిలోకి వస్తూ తలుపును కాలితో గట్టిగా తన్నాడు. ఆ శబ్దానికి నిద్రపోతున్న వెంకటరమణ లేచి గణేష్‌ను మందలించాడు. తాగి అల్లరి చేయొద్దని హెచ్చరించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. సహనం కోల్పోయిన గణేశ్ తన వద్ద ఉన్న గడ్డం గీసే కత్తితో వెంకటరమణ పీక కోశాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య తర్వాత గణేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన నీలి వెంక టరమణ హైదరాబాద్‌ ధరంకరం రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అమీర్ పేట హనుమ యోగాలక్ష్మి అన్నపూర్ణ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. వెంకట రమణ ఉంటున్న గదిలోనే ఏలూరు జిల్లా తంగెళ్లమూడికి చెందిన గణేష్, కేశవ సింగ్ , అజయ్, అరుణ్ ఉంటు న్నారు.

శనివారం రాత్రి మరో మిత్రు డితో కలిసి మద్యం తాగి వచ్చి హాస్టల్ గదిలో గొడవకి దిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తలుపును తన్నడంతో మొదట ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత గణేష్ అదే గదిలో మిత్రుడితో కలిసి బిర్యానీ తింటూ గట్టిగా మాట్లాడుతుండటంతో వెంకటరమణ మందలించినట్టు రూమ్‌ మేట్స్‌ చెబుతున్నారు. వారి మధ్య గొడవతో హాస్టల్ నిర్వాహకులకు చెప్పందుకు కేశవసింగ్, అజయ్‌ కిందకు వెళ్లినట్టు చెబుతున్నారు. ఆ సమయంలో గణేష్‌ హత్య చేసినట్టు పోలీసులకు వివరించారు. హత్యకు పాల్పడిన గణేష్ అక్కడి నుంచి పారిపోయాడు. అతని మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp channel

Read Entire Article