Bhupalpally District : బెదిరించి లేడి కానిస్టేబుల్ పై అత్యాచారం..! కాళేశ్వరం SI డిస్మిస్

5 months ago 90
ARTICLE AD

Kaleshwaram SI Bhavani Sen: భూపాలపల్లి జిల్లాలో ఓ ఎస్సై బాగోతం బయటపడింది. ఏకంగా అతను పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే విధులు నిర్వర్తిస్తున్న లేడి కానిస్టేబుల్ పై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం బయటికి చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. ఎట్టకేలకు ఈ విషయం బయటికి వచ్చింది. బాధిత కానిస్టేబుల్… జిల్లా ఎస్పీని ఆశ్రించింది. ఎస్పీ ముందు తన గోడును వెళ్లబోసుకుంది.

ఏం జరిగిందంటే…?

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ భవాని సేన్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే స్టేషన్ లో పని చేస్తున్న ఓ లేడి కానిస్టేబుల్ పై అత్యాచారం చేశాడు. సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి… లొంగదీసుకున్నాడు. విషయం బయటికి చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. లైంగిక వేధింపుల క్రమం రోజురోజుకూ పెరిగిపోవటంతో… బాధితురాలు నేరుగా జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై వివరాలను వెల్లడించింది.

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందటంతో సదరు ఎస్సైపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టగా… ఎస్సైపై ఎఫ్ఆర్ నమోదు చేశారు. 376(2) (A) (B), సెక్షన్ 324 , సెక్షన్ 449, సెక్షన్ 506 and Section 27 (Arms Act)సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు.

ఎస్సైపై విచారణ కొనసాగుతోందని డీఎస్పీ సంపత్ రావు వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రే ఎస్సై భవాని సేన్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎస్సై వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ ను వెనక్కి తీసుకున్నారు. అతడిని విధుల నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

భవానీ సేన్ గౌడ్ గతంలో ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా విధులు నిర్వర్తించాడు. అక్కడ కూడా ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న కారణంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. నవంబర్ 2023 నుంచి కాళేశ్వరం స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఆసిఫాబాద్ టౌన్ కు చెందిన భవానీ సేన్ ముందుగా కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యాడు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో కీలకంగా పని చేయటంతో ఆయనకు ఎస్సైగా ప్రమోషన్ దక్కింది.

Read Entire Article