ARTICLE AD
Blood Donation Campaign Run: రక్తదానం ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కలిపించే ఉద్దేశ్యంతో హైదరాబాద్ లో ఆదివారం ‘రన్’ కార్యక్రమం జరిగింది. అపోలో హాస్పిటల్స్ , టీసీఎస్ కంపెనీ సంయుక్తంగా ఈవెంట్ ను నిర్వహించాయి.
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని(జూన్ 16) పురస్కరించుకుని "వాక్. డొనేట్. రిపీట్ " అనే థీమ్ తో 3 కి.మీ.ల రన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిచారు. రక్తదానం ప్రాముఖ్యత, అవగాహన పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ వాక్ ను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపు 1500 మంది టీసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ (తెలంగాణ రీజియన్) సీఈఓ తేజస్వీ రావు, డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ (తెలంగాణ రీజియన్) డాక్టర్ రవీంద్ర బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. “రక్తదానం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తాము చేపట్టిన ఈ వాక్ కు TCS సహకారం అందిచడం హర్షణీయం. మా తీసుకున్న థీమ్, ప్రజల్లో తప్పక చైతన్యం తెగలదు" అని ఆశాభావం వ్యక్తం చేశారు
ఆ తర్వాత TCS రీజినల్ హెడ్ చల్ల నాగ్, హెడ్ అఫ్ TCS హైదరాబాద్ హెచ్ ఆర్ శ్రీకాంత్ సూరంపూడి మాట్లాడారు. రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహనా పెంపొందించడానికి అపోలో హాస్పిటల్స్ చేపట్టిన ఈ రన్ లో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు .ప్రజల్లో అవగాహనా పెంపొందించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంలో తమ కంపెనీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. అపోలో హాస్పిటల్ భవిషత్తులో ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.
రక్తదానం అనేది చిన్న అంశం అయినప్పటికీ , ఒక యూనిట్ బ్లడ్ ముగ్గురి జీవితాలలో వెలుగులను నింపగలదు అని డాక్టర్ సుధా రంగనాథన్ (హెడ్ అఫ్ బ్లడ్ బ్యాంక్ అపోలో హాస్పిటల్స్) అన్నారు .