Bomb Hoax Calls : శంషాబాద్ ఎయిర్ పోర్టులోని 6 విమానాలకు, తిరుపతిలోని 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు

1 month ago 48
ARTICLE AD

Bomb Hoax Calls : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా తిరుపతిలోని 8 హోటళ్లకు, శంషాబాద్ లోని 6 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ వచ్చాయి. పోలీసులు, భద్రతా అధికారులు తనిఖీలు చేసి నకిలీ కాల్స్ గా తేల్చారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని 6 విమానాలకు, తిరుపతిలోని 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని 6 విమానాలకు, తిరుపతిలోని 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు

తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తిరుపతిలోని పలు హోటళ్లకు, హైదరాబాద్ విమానాశ్రయంలోని పలు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దేశం వ్యాప్తంగా వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

టెంపుల్ సిటీ తిరుపతికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తు్న్నాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు వచ్చిన హోటళ్లలో డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేసి, ఎలాంటి బాంబులు లేవని నిర్థారించారు.

తాజాగా తిరుపతిలోని 8 హోటళ్లకు బాంబు బెదిరింపు బెయిల్స్ వచ్చాయి. మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా తిరుపతిలోని హోటళ్లకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. గతంలో బాంబు బెదిరింపులే రాగా....తాజాగా గ్యాస్ లైన్, వాటర్ పైపు లైన్లు, మురుగునీటి పైపుల్లో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ రావడంతో హోటళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్రి, తాజ్, బ్లిస్, పాయ్ వైస్రాయ్, మినర్వా, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హోటళ్ల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో...డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ హోటళ్లను తనిఖీ నిర్వహించారు. హోటళ్లలో ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అని నిర్థారించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. విమానాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసి, ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్థారించారు. మంగళవారం దేశంలోని సుమారు 100కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో గత 16 రోజుల్లో 510కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

విమానాలకు బాంబు బెదిరింపుల కుట్ర వెనుక ఓ పుస్తక రచయిత ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. గోండియాకు చెందిన జగదీశ్‌ ఉయికే అనే వ్యక్తి ఈ బాంబు బెదిరింపులకు కారణమని నాగ్‌పుర్‌ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదంపై ఓ పుస్తకం రాసిన ఉయికే 2021లో ఓ కేసులో అరెస్టైనట్లు పేర్కొన్నారు. ఇతడి ఈ-మెయిల్‌ నుంచే పలు విమానయాన సంస్థలకు ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించాడని గుర్తించారు. బాంబు బెదిరింపుతో విమానసర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానయాన సంస్థలు తెలిపారు.

Whats_app_banner

Read Entire Article