ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Chevella Mla Yadaiah : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ - కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!
Chevella MLA Yadaiah Joined Congress : చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. దీంతో కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది.
కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!
Chevella MLA Yadaiah : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారగా… తాజాగా చేవెళ్ల నుంచి గెలిచిన కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన… ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన యాదయ్య…. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 268 ఓట్ల తేడాతో బయటపడ్డారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీమ్ భరత్ నుంచి గట్టి పోటీని ఎదుర్కున్నారు.
BRS Chevella MLA Kale Yadaiah Joined Congress
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.#KaleYadayya @revanth_anumula pic.twitter.com/6lN3JuRTyy
2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరారు. తాజాగా కాలె యాదయ్య చేరితో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.