CM Revanth Reddy Helps Tribal Girl : గిరిజన బాలిక కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు ఆర్థిక సాయం

2 months ago 82
ARTICLE AD

CM Revanth Reddy Helps Tribal Girl : డాక్టర్ కావాలన్న ఓ గిరిజన విద్యార్థిని కలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారు. ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థిని సాయి శ్రద్ధకు ఆర్థిక సాయం అందించారు.

గిరిజన బాలిక కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు ఆర్థిక సాయం

గిరిజన బాలిక కల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య విద్యకు ఆర్థిక సాయం

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించింది. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం సీఎం దృష్టికి వచ్చింది. ఆ విద్యార్థిని కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సాయిశ్రద్ధ తల్లిదండ్రులతో కలిసి ఇవాళ ముఖ్యమంత్రిని కలిశారు. వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సీఎం...సాయి శ్రద్ధకు అందించారు. వైద్య విద్య పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సందర్భంగా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆదివాసీ బాలికకు నీట్ లో 108వ ర్యాంకు

ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఓ యువతి వైద్యురాలు కావాలనే ఆశయంతో ఎంతో కష్టపడి చదివింది. చివరికి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం వచ్చింది. తన లక్ష్యానికి చేరుకునేందుకు ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడకు చెందిన మెస్రం జ్ఞానేశ్వర్, లక్ష్మి దంపతులకు శుభం, సాయి శ్రద్ధ ఇద్దరు సంతానం. జ్ఞానేశ్వర్ టైలర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని కొడుకు, కూతురిని చదివిస్తున్నారు. కొడుకు శుభం బీటెక్ చదివి గేట్ పరీక్షకు సిద్ధం అవుతున్నాడు.

సాయిశ్రద్ధ నార్నూర్ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివింది. అనంతరం ప్రభుత్వ కార్పొరేట్ స్కీమ్ సాయంతో వరంగల్ లో ఇంటర్మీడియేట్ పూర్తిచేసింది. డాక్టర్ కావాలనే తన జీవిత ఆశయం కోసం పట్టుదలగా చదివి నీట్ పరీక్షలో ఎస్టీ విభాగంలో 108వ ర్యాంకు సాధించింది. కౌన్సెలింగ్ లో మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజులు, గ్రంథాలయ రుసుము, పుస్తకాలకు కలిపి దాదాపు రూ.1.30 లక్షలు ఖర్చు అవుతుందని తెలిసింది. అంత పెద్ద మొత్తం డబ్బులు కట్టలేక, ఎవరైనా దాతలు సాయంచేయాలని సాయిశ్రద్ధ తల్లిదండ్రులు వేడుకుంటున్నరు. దాతలు 8096343001 నెంబర్ సాయం చేయాలని జ్ఞానేశ్వర్ దంపతులు కోరుతున్నారు. విద్యార్థిని పరిస్థిని ఈనాడు పేపర్ ప్రచురించింది. ఈ కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ బాలికకు ఆర్థిక సాయం అందించారు.

Whats_app_banner

Read Entire Article