ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Cm Revanth Reddy : రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు, రేషన్ కార్డు ప్రామాణికం కాదు- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.
రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. అలాగే రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.