Diwali 2024 : టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనకండి : రాజాసింగ్

2 months ago 69
ARTICLE AD

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటే కొనకండని పిలుపునిచ్చారు. టపాసులపై లక్ష్మీదేవి బొమ్మ పెట్టడం పెద్ద కుట్ర అని వ్యాఖ్యానించారుయ ఈ ఏడాది లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాసులను బహిష్కరిస్తే.. వచ్చే ఏడాది నుంచి ఎవరూ తయారు చేయరని ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

ఏలూరులో విషాదం..

ఏలూరులో బాణసంచా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. బాణసంచా తీసుకెళ్తుండగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా బాణసంచా పేలి అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందారు. పేలుడు ధాటికి వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది. గాయల పాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

1.దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు తగిన భద్రతా సూచనలు పాటించాలి. బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. మీ ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయండి. పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.

2.బాణసంచా కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి. బాణసంచాపై రాసిన సూచనలను జాగ్రత్తగా పాటించండి. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు టపాసులు కాల్చాలి. రాకెట్లు, ఫ్లవర్పాట్లు, ఇతర ఎగిరే క్రాకర్లను గడ్డితో చేసిన ఇళ్లు, ఎండుగడ్డి ఉండే ప్రాంతాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చాలి. మీకు ప్రమాదవశాత్తూ గాయలైనట్లయితే చల్లటి నీటిని గాయాన్ని కడిగి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

3.దీపావళి టపాసులతో ప్రయోగాలు చేయవద్దు. అవి కాల్చేపుడు మీ ముఖానికి దూరంగా ఉంచుకోవాలి. టపాసులు సరిగ్గా కాలకపోతే.. మళ్లీ వాటిని వెలిగించే ప్రయత్నం చేయవద్దు.

4.విద్యుత్ స్తంభాల దగ్గరగా బాణసంచా కాల్చవద్దు. ఫ్లవర్పాట్లు, హ్యాండ్ బాంబ్లు వంటి బాణాసంచాను కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు. ఫైర్ క్రాకర్లను వెలిగించి రోడ్లపై ఎక్కడి పడితే అక్కడ బహిరంగంగా విసిరేయకండి. క్రాకర్స్ నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండండి. దోమలు పోతాయని ఇంట్లో మతాబులు కాల్చడం వంటి చేయకండి.

5.అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 నెంబర్లను సంప్రదించండి.

Whats_app_banner

Read Entire Article