ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Govt Jobs 2024 : ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ 'బెల్' నోటిఫికేషన్ - ఆన్ లైన్ లో దరఖాస్తులు, పూర్తి వివరాలివే
BEL Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 32 కొలువులను భర్తీ చేయనున్నారు.
బెల్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
Bharat Electronics Limited Hyderabad Recruitment 2024: ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా మొత్తం 32 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జూలై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. శాశ్వత ప్రతిపాదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు.
ముఖ్య వివరాలు :
ఉద్యోగ నోటిఫికేషన్ - భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్మొత్తం ఖాళీలు - 32ఉద్యోగాల వివరాలు - ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ 12, టెక్నీషియన్ ‘సి’ - 17, జూనియర్ అసిస్టెంట్ 3 ఖాళీలు ఉన్నాయి.అర్హత- ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, BBM కోర్సులో పాసై ఉండాలి. ఇందులో పోస్టును అనుసరించి అర్హతలు నిర్ణయించారు. పైన ఇచ్చిన పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ లో వివరాలను తెలుసుకోవచ్చు.వయోపరిమితి - 28 ఏళ్లు మించవద్దు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు Relaxation ఉంటుంది.దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో చేయాల్సి ఉంటుంది.దరఖాస్తు రుసుం - జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.పేమెంట్ లింక్ - https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=14842 ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.ఎంపిక ప్రక్రియ - షార్ట్‌లిస్ట్, రాత పరీక్షలు ఉంటాయి.దరఖాస్తు చివరి తేదీ - 11 జూలై 2024.దరఖాస్తు లింక్ - https://jobapply.in/bel2024HYDEATTECHJA ఏమైనా సందేహాలు ఉంటే hydhrgen@bel.co.in మెయిల్ లేదా 040- 27194999 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.అగ్నివీర్ ఉద్యోగ నోటిఫికేషన్….
అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు ఎంపికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపిక పరీక్షకు అవివాహితులైన భారతీయెలైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుండి వాయుసేన ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అగ్నివీర్ నియామకాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2024 జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జూలై 28వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. 2024 అక్టోబర్ 18నుంచి ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ల కోసం https://agnipathvayu.cdac.in కోసం సందర్శించాల్సి ఉంటుంది. అగ్నివీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే వారు 2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3 మధ్యకాలంలో జన్మించాల్సి ఉంటుంది.
అగ్నివీర్ వాయుసేన ఎంపికల కోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.550/- ప్లస్ GST చెల్లించాల్సి ఉంటుంది. అగ్నివీర్ వాయు ఎంపికలు 02/2025 విద్యార్హతలు, వైద్య ప్రమాణాలు, నియమ నిబంధనలతో పాటు నోటిఫికేషన్ పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తులు పూరించడానికి సూచనలు, రిజిస్ట్రేషన్ కోసం https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్ సందర్శించాల్సి ఉంటుంది.అర్హతల వివరాలను కూడా ఇదే సైట్ లో చూడొచ్చు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.