HCU Phd Notification 2024 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీ Phd నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

3 months ago 85
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Phd Notification 2024 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీ Phd నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

Hyderabad Central University : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ నోటిఫికేషన్ విడుదైంది. 2024-24 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ లో ప్రవేశాలు కల్పించనుంది.

పీహెచ్డీ ప్రవేశాలు 2024

పీహెచ్ డీ ప్రవేశాల కోసం హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సబ్జెక్టులతో పాటు ఖాళీల వివరాలను పేర్కొంది. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అక్టోబరు 10వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్య వివరాలు :

వర్శిటీ - సెంట్రల్ వర్శిటీ, హైదరాబాద్(HCU).అర్హతలు - 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.ఎంపిక ప్రక్రియ - రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. జేఆర్ఎఫ్ అర్హత పొందిన అభ్యర్థులకు పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం ఉంది.దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోఆన్ లైన్ దరఖాస్తులకు తుది గడువు - 14 -09 -2024.ఎగ్జామ్ హాల్ టికెట్లు డౌన్లోడ్ - 10 -10 - 2024పరీక్షల ఎంట్రెన్స్ తేదీ - 19 - 10- 2024 నుంచి 20 -10 -2024.ప్రతి రోజూ మూడు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.మొత్తం 22 కోర్సుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. ఈడబ్యూఎస్ రూ. 500, ఓబీసీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 275 పేమెంట్ చేయాలి.అర్హత గల అభ్యర్థులు http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తులు, హాల్ టికెట్లు, పరీక్షల షెడ్యూల్, ఇంటర్వూల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.ఏమైనా సందేహాలు ఉంటే 040-2313 2444 / 040-2313 2102 నెంబర్లను సంప్రదించవచ్చు.aao@uohyd.ac.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
Read Entire Article