Hyderabad Diwali : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రాత్రి 10 గంటల వరకే టపాసులు పేల్చడానికి అనుమతి

2 months ago 59
ARTICLE AD

దీపావళి సందర్భంగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 02 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. నగర వాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఈ ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చడంపై నిషేధం విధించిన విషయాన్ని పోలీస్ నోటిసుల్లో ప్రస్తావించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా.. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు.

ఈ 5 జాగ్రత్తలు పాటించండి..

1.దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు తగిన భద్రతా సూచనలు పాటించాలి. బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. మీ ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయండి. పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.

2.బాణసంచా కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి. బాణసంచాపై రాసిన సూచనలను జాగ్రత్తగా పాటించండి. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు టపాసులు కాల్చాలి. రాకెట్లు, ఫ్లవర్పాట్లు, ఇతర ఎగిరే క్రాకర్లను గడ్డితో చేసిన ఇళ్లు, ఎండుగడ్డి ఉండే ప్రాంతాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చాలి. మీకు ప్రమాదవశాత్తూ గాయలైనట్లయితే చల్లటి నీటిని గాయాన్ని కడిగి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

3.దీపావళి టపాసులతో ప్రయోగాలు చేయవద్దు. అవి కాల్చేపుడు మీ ముఖానికి దూరంగా ఉంచుకోవాలి. టపాసులు సరిగ్గా కాలకపోతే.. మళ్లీ వాటిని వెలిగించే ప్రయత్నం చేయవద్దు.

4.విద్యుత్ స్తంభాల దగ్గరగా బాణసంచా కాల్చవద్దు. ఫ్లవర్పాట్లు, హ్యాండ్ బాంబ్లు వంటి బాణాసంచాను కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు. ఫైర్ క్రాకర్లను వెలిగించి రోడ్లపై ఎక్కడి పడితే అక్కడ బహిరంగంగా విసిరేయకండి. క్రాకర్స్ నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండండి. దోమలు పోతాయని ఇంట్లో మతాబులు కాల్చడం వంటి చేయకండి.

5.అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 నెంబర్లను సంప్రదించండి.

పండగపూట విషాదం..

దీపావళి పండగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలవరం గ్రామంలోని ఓ ఇంట్లో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన శ్రీరాంరమేష్‌ అనే వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఉన్నట్లుండి ఇంట్లో మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌ జరిగి కూలర్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. బీరువాలో దాచిన డబ్బు, 15 గ్రాముల బంగారం మంటల్లో పూర్తిగా కాలిపోయింది.

Whats_app_banner

Read Entire Article