హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ :
కేరళలోని
అలెప్పీ, మున్నార్ సందర్శించుకోవాలని అనుకునేవారు ఈ ప్యాకేజీని ఎంచుకోవచ్చు. KERALA HILLS & WATERS పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటలో ఉంది. జులై 9, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.తొలి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. రాత్రి మెుత్తం జర్నీ ఉంటుంది. రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్ వెళ్తారు. అక్కడ నుంచి మున్నార్ లోని హెటల్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. రాత్రి మున్నార్ లోనే బస చేయాల్సి ఉంటుంది.మూడో రోజు ఉదయం ఎరవికులం జాతీయ పార్క్ ను సందర్శన ఉంటుంది. మెట్టుపెట్టి డ్యామ్, ఏకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు. 4వ రోజు అల్లెప్పీకి వెళ్తారు. బ్యాక్ వాటర్ అందాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. రాత్రి అల్లెప్పీలోనే ఉంటారు.ఐదో రోజు హెటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడ నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్ వెళ్తారు. ఉదయం 11.20 గంటలకు శబరి ఎక్సె ప్రెస్ లో హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వస్తారు. దీంతో కేరళ టూర్ ముగుస్తుంది.హైదరాబాద్ - కేరళ టూర్
ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ (3ఏ) క్లాస్ సింగిల్ షేరింగ్ కు రూ. 32,830 ధర ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19,070 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,590 గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో వేర్వురు ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు కూడా వేర్వురు ధరలు నిర్ణయించారు. ఈ టూర్‌లో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092 లింక్ పై క్లిక్ ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 8287932229 / 9281495843 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.