IRCTC Kashmir Tour : హైదరాబాద్ టూ కశ్మీర్ - తక్కువ ధరలోనే 7 రోజుల ట్రిప్, ఇదిగో కొత్త ప్యాకేజీ

5 months ago 90
ARTICLE AD

IRCTC Hyderabad - Kashmir Tour Package : కశ్మీర్…. భూతలస్వర్గంగా పేరు గాంచింది. ఇక్కడి సహజ అందాలను చూసి ఏవరైనా ఫిదా అవ్వాల్సిందే. కశ్మీర్ అందాలను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే మరీ..!

కశ్మీర్ వెళ్లటం చాలా ఖర్చుతో కూడిన పని అని చాలా మంది భావిస్తుంటారు. కానీ బడ్జెట్ ధరలోనే IRCTC టూరిజం అనేక రకాల ప్యాకేజీలను తీసుకువస్తోంది. ."MYSTICAL KASHMIR EX HYDERABAD' పేరుతో హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ ప్యాకేజీ 25 జూన్, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ ఒక్క డేట్ మాత్రమే కాకుండా… 17.07.2024 & 01.08.2024 తేదీల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఏడు రోజులు సాగే ఈ ట్రిప్ లో….. శ్రీనగర్, గుల్మార్గ్, Pahalgamతో పాటు Sonmarg ఇందులో కవర్ అవుతాయి.

హైదరాబాద్ - కశ్మీర్ షెడ్యూల్ వివరాలు:

Hyderabad- Leh : మొదటిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. ఉదయం 10 గంటలకు లేహ్ కు చేరుకుంటారు. పలు ప్రాంతాలను చూస్తారు. Leh- Sham Valley- Leh (75 km 02 hrs one way) : బ్రేక్ ఫాస్ట్ తర్వాత Leh- Srinagar Highwayపై జర్నీ ఉంటుంది. ఇక్కడ ఉన్న Hall of Fame మ్యూజియంను సందర్శిస్తారు. Zorawar Fortతో పాటు Gurudwara Patthar Sahib కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శాంతి స్తూపాకు వెళ్తారు. రాత్రికి లేహ్ లోనే ఉంటారు.Leh - Nubra : బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. Nubra వ్యాలీకి వెళ్తారు. ప్రపంచంలోనే ఎత్తైన మోటారు రహదారి. మధ్యాహ్న భోజనం తర్వాత భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో నివసించే ప్రజల జీవన శైలిని చూడొచ్చు. సాయంత్రం ఒంటె సఫారీని ఉంటుంది. రాత్రికి నుబ్రా వ్యాలీలోనే రాత్రి బస చేస్తారు.Nubra – Turtuk – Nubra : టిఫిన్ చేసి తర్వాత ప్యాంగాగ్ కు వెళ్తారు. ఇక్కడ ఉండే ఉప్పునీటి సరసును చూస్తారు. ఇది భారత్ - చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దు ద్వారా విభజించబడి ఉంటుంది. ఈ సరస్సు ఒడ్డున ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి.Pangong – Leh via Changla : అత్యంత ఎత్తైన ప్రాంతం నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేహ్ కు వెళ్తారు. Thiksey Monastery, Shey Palaceను సందర్శిస్తారు. రాత్రికి లేహ్ లో ఉంటారు.Leh Airport Drop : లేహ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాద్ కు బయల్దేరుతారు. కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 65670గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 60200ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 60755గా ఉంది. చిన్న పిల్లలకు వేర్వురు ధరలను నిర్ణయించారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే IRCTC టూరిజం జోనల్ ఆఫీస్ 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.,
Read Entire Article