Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా- 5 వేల ఉద్యోగ అవకాశాలు

5 months ago 93
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా- 5 వేల ఉద్యోగ అవకాశాలు

Job Mela : ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా

Job Mela : ఈ నెల 24వ తేదీన హుస్నాబాద్ లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగపరుచుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మంగళవారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్ ను మంత్రి పొన్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర యువజన సర్వీస్ ల శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

నిరుద్యోగులైన యువత సద్వినియోగం చేసుకోవాలని

ఈ నెల 24 వ తేదీన హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులైన యువతీ యువకులు ఉపయోగించుకోవాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగ యువత జాబ్ మేళాను వినియోగించుకొని ఎక్కువ మంది ఉపాధి పొందాలని సూచించారు. విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్న యువతకు రాబోయే కాలంలో తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్స్ లో ఉదయం 10:00 గంటల నుంచి ఈ జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులు

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే SC,ST,BC అభ్యర్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్ స్టడీ రెసిడెన్సియల్స్ తో కూడిన ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూన్ 17 నుంచి జులై 10 వరకు ఆన్ లైన్ వెబ్ సైట్ http://tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మూడు లక్షల లోపు ఆదాయ ధ్రువ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఈ అభ్యర్థులకు జులై 21న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. జులై 21న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి తెలంగాణ స్టడీ సర్కిల్ లో 10 నెలల పాటు ఉచిత రెసిడెన్సియల్ కోచింగ్ ఇస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి 5:00 లోపు సంప్రదించవచ్చని తెలిపారు.

Read Entire Article