KCR Letter : మీ విచారణ చట్ట విరుద్ధం, నిష్పాక్షికత లేదు - పవర్‌ కమిషన్‌ కు కేసీఆర్ లేఖ

5 months ago 85
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Letter : మీ విచారణ చట్ట విరుద్ధం, నిష్పాక్షికత లేదు - పవర్‌ కమిషన్‌ కు కేసీఆర్ లేఖ

KCR Letter to Justice L Narasimha Reddy Commission: విద్యుత్‌ కొనుగోళ్లపై నియమించిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. జూన్ 11వ తేదీన పత్రికా విలేకర్లు సమావేశంలో మాట్లాడిన పలు విషయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

జస్టిస్ ఎన్ నర్సింహ్మా రెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ

జస్టిస్ ఎన్ నర్సింహ్మా రెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ

KCR Letter to Justice L Narasimha Reddy Commission: ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీలతో కూడిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

ఈఆర్ సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచిచకుండా బాధ్యతలు స్వీకరించటం విచారకమన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి... అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే జూన్ 11వ తేదీన మీడియా సమావేశంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కమిషన్ వ్వవహరిస్తున్న తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ఘంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని… ఎంక్వైరీ బాధ్యతల నుంచి స్వచ్ఛదంగా తప్పుకోవాలని కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు.

విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా కమిషన్ మాటలున్నాయని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదని…. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోందని రాసుకొచ్చారు. లేఖలో పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరారు.

12 పేజీలతో కూడిన లేఖలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న విద్యుత్ సమస్యల నుంచి పదేళ్లలో చోటు చేసుకున్న మార్పుల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పడిన కొత్తలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఫలితంగా ఏ ఒక్క రంగం కూడా సక్రమంగా నడవలేకపోయిందని గుర్తు చేశారు. పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. 

విభజన చట్ట ప్రకారం… తెలంగాణకు చట్ట ప్రకారం 53.89 శాతం, ఏపీకి 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్‌ను వినియోగించుకోవాలని నిర్దేశించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ  ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడిందని చెప్పారు.  మొత్తంగా 5 వేల మెగావాట్ల కొరతతో తెలంగాణ విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందన్నారు  ఈ నేపథ్యంలోనే విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చామని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటు సమయంలో 7778 మెగావాట్లు విద్యుత్తు స్థాపన ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ చూస్తే…  20,000 మెగావాట్లకు పైచిలుకు చేరటం గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలే కారమమని తెలిపారు. 

భదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే దశలో రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ లోటు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.  నాటి పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థలు గత్యంతరం లేక అధిక ధరలకు పవన్ ఎక్ఛైంజ్ ల ద్వారా కరెంట్ కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీహెచ్ఈఎల్ కు నామినేషన్ పద్ధతిలోనే భదాద్రి థర్మల్ ప్లాంట్ పనులను అప్పగించామని తెలిపారు.

ఇటీవలే కేసీఆర్ కు నోటీసులు….

ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పవన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 15 లోపు విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. అయితే జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ ను కోరారు.

జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (PPA) తన ప్రమేయంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ కోరింది. దీనిపై స్పందించిన కేసీఆర్ జులై 30 వరకు తనకు అదనపు సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు.

యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపై కూడా విచారణ జరుగుతోంది.

జూన్ 15వ తేదీతో గడువు ముగిస్తున్న నేపథ్యంలో పవర్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. అయితే కేసీఆర్ లేఖపై కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది…!

Read Entire Article