KNRUHS Admissions : మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

2 months ago 70
ARTICLE AD

మెడికల్‌పీజీ కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ బుధవారం వివరాలను వెల్లడించింది. నీట్‌‌ పీజీ ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు… అక్టోబర్ 31వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 7వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. మెరిట్ లిస్ట్ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభమయ్యే వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్ చేయాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. నవంబర్ 7 సాయంత్రం 6 గంటలలోపే ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం వర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో ఉంచినట్లు పేర్కొన్నారు.

పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు :

పారామెడికల్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. 2024-2025 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్ లో వివరాలను పేర్కొన్నారు.

అక్టోబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలి. జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తారు.నవంబర్ 20వ తేదీలో పు ఎంపిక జాబితా విడుదలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ప్రభుత్వ పారామెడికల్ సంస్థల్లో మొత్తం 3,122 సీట్లు ఉన్నాయి. ఇవే కాకుండా పారామెడికల్ కోర్సుల్లో కూడా సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ కోర్సుల కాలపరిమితి 2 ఏళ్లు ఉంటుంది. https://tgpmb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నవంబర్ 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Whats_app_banner

Read Entire Article