KTR On CM Revanth : 'నువ్వా... KCR పేరును తుడిచేది..?' సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

2 months ago 58
ARTICLE AD

రాజకీయంగా కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి అని.. తెలంగాణ కోసం పదవులను కూడా తృణపాయంగా వదిలేశారని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్ పేరును తుడిచేది నువ్వా..? అంటూ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర అని ట్వీట్ లో రాసుకొచ్చారు.

“నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు! నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు! నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడు! చిట్టినాయుడు! నువ్వా! KCR పేరును తుడిచేది? తెలంగాణ చరిత్ర KCR..”అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందని, ఆపై కేసీఆర్ అనే పదమే తెలంగాణ రాజకీయాల్లో కనిపించదన్నారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు నడుస్తున్నాయన్నారు. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుందన్నారు. త్వరలోనే కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ ను వాడతామన్నారు. బావను ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయన్నారు. దీనిని దీపావళి పార్టీ అని ఎలా అంటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ పేరును తుడిచివేయాలేరంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందిస్తూ… ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

Whats_app_banner

Read Entire Article