Medak Tragedy : దీపావళి వేళ విషాదం.. ఇద్దరిని బలి తీసుకున్న రాకాసి పిడుగు

2 months ago 65
ARTICLE AD

గొర్రెలు మేపడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వర్షం పడుతుండడంతో చెట్టు కింద నిలబడ్డారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణం రెండు కుటుంబాల్లో పండగ పూట విషాదం నింపింది. ఈ విషాద సంఘటన టేక్మాల్ మండలంలోని ధనూర గ్రామ శివారులో జరిగింది.

ధనూర గ్రామానికి చెందిన డాకూరు శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు భరత్ (15), చరణ్ ఉన్నారు. శ్రీశైలం తనకున్న గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజు మాదిరిగానే బుధవారం శ్రీశైలం గొర్రెలను మేపడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అక్కడే అక్కడే ఉన్న శ్రీశైలం.. ఆ తర్వాత కుమారుడు భరత్‌ను గొర్రెల వద్ద ఉంచి, తాను ఇంటికి వెళ్ళాడు.

అంతలోనే పిడుగు రూపంలో వచ్చిన మృతువు భరత్‌ను బలి తీసుకుంది. కొడుకు మరణ వార్త విన్న తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. భరత్ ధనూర గ్రామంలో పదో తరగతి చదువుతున్నాడు. చదువులో, ఆటలలో ఎప్పుడు ముందుంటాడు. అతని మరణ వార్త తెలుసుకున్నస్నేహితులు భోరున విలపిస్తున్నారు.

అదే గ్రామానికి చెందిన బండారు బేతయ్య (42) గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బేతయ్యకు భార్య పోచమ్మ, కుమారుడు అనిల్, కూతురు సబిత ఉన్నారు. కూతురికి వివాహం చేయగా, కొడుకు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి గొర్రెల పెంపకమే జీవనాధారం. గొర్రెలను మేపడానికి వెళ్లిన బేతయ్య పిడుగు పడి మృతి చెందారు. తనకు దిక్కెవరని భార్య పోచమ్మ విలపిస్తోంది. ఇద్దరి మరణంతో ధనూర గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

సంగారెడ్డిలో..

పిడుగుపాటుకు గురై 17 గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. డాకూర్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల వెంకటి, మొగులయ్య తమ గొర్రెలను గ్రామ శివారులోకి మేతకు తోలుకొని వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం వస్తూ పిడుగుపడింది. ఆ పిడుగు పాటుకు 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.

దామోదర్ రాజనర్సింహ దిగ్భ్రాంతి..

ధనూరలో భరత్, బేతయ్య పిడుగుపాటుతో అకాల మృతి చెందిన ఘటనపై.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో 17 గొర్రెలు మృత్యువాత పడిన ఘటనపై ఆరా తీశారు. అకాల వర్షాల వల్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దామోదర్ రాజనర్సింహ సూచించారు. చనిపోయిన వారి కుటుంబాలను, బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Whats_app_banner

Read Entire Article