NEET Free Coaching : ఉచితంగా లాంగ్ టర్మ్ 'నీట్' కోచింగ్ - అర్హతలు, దరఖాస్తు ముఖ్య తేదీలివే

5 months ago 87
ARTICLE AD

TGWREIS NEET Free Coaching : నీట్ కు ప్రిపేర్ అయ్యే వారికి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా లాగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేందుకు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ముఖ్య వివరాలు :

ప్రకటన - తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ2024- 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ ఇస్తారు.ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.హైదరాబాద్ లోని TGWREIS కేంద్రాలైన గౌలిదొడ్డి, నార్సింగి, చిలుకూరు, మహేంద్ర హిల్స్ గురుకులాల వద్ద కోచింగ్ ఉంటుంది.ఎస్సీలకు 334, బీసీలకు 8, ఓసీలకు 8 సీట్లు ఉంటాయి.దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్ పాస్ అయి ఉండాలి.NEET 2024 పరీక్ష రాసి ఉండాలి.https://tgswreis.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు - రూ. 200దరఖాస్తులకు చివరి తేదీ - 24 జూన్ 2024.సర్టిఫికెట్ వెరిఫికేషన్ - 28-June-2024అప్లికేషన్ డైరెక్ట్ లింక్ - https://kishoremamilla-001-site2.itempurl.com/start.html

.వైద్యశాఖలో ఉద్యోగాలు…..

 వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వ‌ర్షాకాలంలో డెంగీ, ఇత‌ర విష జ్వరాలు ప్రబ‌లుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఖాళీల భ‌ర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్ధమైంది.

 రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల కొర‌త ఎక్కువ‌గా ఉంది. స‌మ‌స్యను అధిగ‌మించి ప్రజ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులు 531 భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌ల నియామ‌క బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్‌బీ) త్వర‌లోనే పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. నియామ‌కాల అనంత‌రం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా స‌ర్జన్లను నియ‌మించ‌నున్నారు. 

వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియ‌న్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 193 ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అలాగే, వివిధ ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ‌లు అందించే స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు 31 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి ఎంహెచ్ఎస్ఆర్‌బీ నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది.

సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులు- 531ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టులు-193స్టాఫ్ న‌ర్సుల పోస్టులు-31

ఎన్నికల కోడ్ ఎత్తివేయటంతో రాష్ట్రంలో మరికొన్ని నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీఎస్పీఎస్సీ పరీక్షలు కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి కానున్నాయి. ఆ దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది.

Read Entire Article