Nirmal School Teachers: సెలవుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, గాడి తప్పుతున్న పాఠశాల విద్యా వ్యవస్థ

2 weeks ago 34
ARTICLE AD

Nirmal School Teachers: నిర్మల్‌ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో కొంతమంది పాఠాలు చెప్పడం మానేసి బిట్‌ కాయిన్ల వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు వందమందికి పైగానే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్ని నెలలుగా జిల్లాలో బిట్‌ కాయిన్‌ వ్యవహారం జోరుగా సాగింది. ఏ సారు నోట విన్న అదే మాట వినిపించింది. పాఠశాలలకు రాకుండా కొందరు ఉపాధ్యాయులు సెలవులు పెట్టుకోగా మరికొందరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాఠశాలలకు రావడం లేదు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు స్పందించడం లేదు.

గాడి తప్పిన విద్యావ్యవస్థ...

నిర్మల్ జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. అసలే ఉపాధ్యాయుల కొరతతో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థ బిట్ కాయిన్ దెబ్బరు మరింత చతికిల పడిపోయింది. గొలుసుకట్టు వ్యవహారంతో సంబంధం కలిగి ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇదే వ్యవహారంతో సంబంధం ఉన్న మిగతా ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. . ఈ వ్యవహారం అంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానం తలెత్తుతుంది.

బాధితులు బయటకు రావాలి...

బాధితులు బయటకు వస్తే తప్ప ఈ బిట్ కాయిన్ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టించడంలో ముందున్న వారి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని మీ డబ్బులు మీకు వచ్చే విధంగా చూస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రకటించినప్పటికీ బాధితులు బయటికి రావడానికి జంకుతున్నారు. పెట్టబడులు పెట్టించిన వారు కొందరు మీ డబ్బులను తిరిగి తామే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. మాయ మాటలు నమ్మి మోసపోయిన బాధితులు మరోసారి నక్కజిత్తుల హటలు నమ్మి బలి కావద్దని పోలీసులు సూచిస్తున్నారు. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుందని జిల్లా పోలీసులు హామీ ఇస్తున్నారు.

అన్ని శాఖల్లో బిట్ కాయిన్ పెట్టుబడిదారులు..

అన్ని శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు బిట్ కాయిన్ వ్యవహారంలో పాలుపంచుకున్న వారే. ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండగా పోలీసు,అటవీ, రెవెన్యూ, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు.

నిర్మల్ జిల్లాలో బిట్కాయిన్ వ్యవహారం అన్ని శాఖల్లో కాలు మోపింది. విద్యాశాఖ ముందు వరుసలో ఉండగా మిగతా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు బిట్ కాయిన్ తో అంటకాగిన వారే. బిల్ కాయిన్ గొలుసుకట్టు వ్యవహారంలో పెట్టుబడులు పెట్టని వారిని వింతగా చూసిన పరిస్థితి ఉండేది... కానీ నేడు పెట్టిన వారిని పెట్టనివారు విచిత్రంగా చూసే పరిస్థితి తలెత్తింది.

అక్రమ ధనార్జన ఎంతో కాలం నిలవడు అన్న దానికి నిదర్శనం బిట్కాయిన్ గొలుసుకట్టు వ్యవహారం. కాగా పోలీసులు సైతం కేవలం విద్యాశాఖ పైనే దృష్టి సారించారు. కానీ అన్ని శాఖల్లో బిట్కాయిన్ తిమింగలాలు ఉన్నాయని, ఆ దిశగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

కీలక కుట్రదారు గుర్తింపు: ఎస్పీ జానకి షర్మిల

యూ బిట్ పథకం వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుడిని పోలీసులు గుర్తించారు. భారత దేశం అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేసి ఈ స్కామ్ నిర్వహిం చింది బ్రిజ్ మోహన్ సింగ్ అని పోలీసులు తేల్చారు. ఇతనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోద య్యాయి. ఇతను క్రిప్టో కరెన్సీ ముసుగులో పెద్ద ఎత్తున పెట్టుబడి దారులతో పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తిం చారు. ఇటీవల అరెస్టయిన వారు ఎనిమిది నెలలుగా రహస్య సమావేశాలు నిర్వహించేందుకు, నాలుగు వేర్వేరు దేశాలకు వెళ్లారని, దీని పరిధిని విస్తరించడానికి సమావేశాలు నిర్వహించినట్లు విచారణలో తేల్చారు

క్రిప్టో కరెన్సీలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన ఖాతా లను పోలీసులు స్తంభింప జేశారు. కోట్లాది రూపాయ లతో ఈ వ్యవహారం కొనసాగుతుండగా.. ఈ వ్యవహా రంలో ముడిపడి ఉన్న 11 బ్యాంకు ఖాతాలను స్తంభిం పజేశారు. ఆస్తులను గుర్తించే ప్రక్రియలో పోలీసులు -నిమగ్నమయ్యారు. యూ బిట్, క్రిప్టో కరెన్సీ బాధితులు ముందుకొచ్చి స్టేట్మెంట్ను అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తును వేగ వంతం చేసి బాధితులకు అండగా ఉంటామన్నారు. బాధితులు కోల్పోయిన పెట్టుబడులు తిరిగిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దర్యాప్తు అధికారి, ఏఎస్పీ అవి నాశ్, సహాధికారులు గోపీనాథ్, ఎస్సైలు లింబాద్రి, దేవేందర్, రవి, సాయికృష్ణ, గౌష్లను ఎస్పీ జానకి షర్మిల ప్రశంసించారు.

(రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Read Entire Article