ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Ranthambore Tiger Reserve : రణథంబోర్ లో థ్రిల్లింగ్ అడ్వెంచర్, పులుల మధ్య సఫారీ-6 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!
Ranthambore Tiger Reserve : థ్రిల్లింగ్ అడ్వెంచర్ కు మీరు రెడీనా... అయితే పులుల మధ్య సఫారీ చేసేందుకు రణథంబోర్ నేషనల్ పార్క్ ఎదురుచూస్తుంది. రణథంబోర్ నేషనల్ పార్క్ తో పాటు పర్యాటక ప్రదేశాల వీక్షణకు రాజస్థాన్ టూరిజం 6 రోజుల టూరిజం ప్యాకేజీ అందిస్తోంది.
రణథంబోర్ లో థ్రిల్లింగ్ అడ్వెంచర్, పులుల మధ్య సఫారీ-6 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!
Ranthambore Tiger Reserve : కాంక్రీట్ జంగిల్లో, నాలుగు గొడల మధ్య నలిగిపోతున్నారా? అద్భుత క్షణాలు మీ డైరీలో రాసుకునే టైమ్ వచ్చేసింది. ఓ వారం రోజులు మీ సాధారణ లైఫ్ ను పక్కన పెట్టి అలా రాజస్థాన్ లో విహారానికి వెళ్లిరండి. ప్రకృతి పచ్చదనంతో పాటు రణథంబోర్ లో పులులను చూసేందుకు సఫారీ చేయండి. ఈ థ్రిల్లింగ్ అడ్వెంచర్ కోసం రాజస్థాన్ టూరిజం 6 రోజుల ప్యాకేజీ అందిస్తోంది.
రణథంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ లో టైగర్ రిజర్వ్. ఇది ఒకప్పుడు జైపూర్ రాజకుటుంబానికి చెందిన ప్రైవేట్ గేమ్ రిజర్వ్ గా ఉండేది. జైపూర్ నుంచి 155 కి.మీ దూరంలో ఉన్న రణథంబోర్ లో కొండలు, క్రాగ్‌లు, పచ్చికభూములు, సరస్సులు, వాగులతో నిండి ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ లో అద్భుతమైన పులులను చూడవచ్చు. పులులతో పాటు స్లాత్ బేర్, చిరుతపులి, నక్క, హైనా, ఇండియన్ వోల్ఫ్, చితాల్, సాంబార్ డీర్, బ్లూ బుల్ యాంటెలోప్ లేదా నీల్‌గాయ్, రీసస్ మకాక్, లంగూర్, ఏనుగులు, అనేక రకాల పక్షులు చూడవచ్చు.
ప్యాకేజీ టారిఫ్
వ్యక్తుల సంఖ్య - 2ఏసీ గది + ఏసీ కారు - రూ. 37500నాన్ ఏసీ గది + ఏసీ కారు - రూ.36400ఏసీ గదిలో అదనపు వ్యక్తి - రూ.5000నాన్ ఏసీ గదిలో అదనపు వ్యక్తి - రూ.4000డే 1 : జైపూర్ విమానాశ్రయం / రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులను హోటల్ కు తీసుకెళ్తారు. మిగిలిన రోజు హోటల్ లో విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం నహర్‌ఘర్ కోట సందర్శిస్తారు. రాత్రికి హోటల్ లోనే బస చేస్తారు.డే 2 : ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత అంబర్ కోటను సందర్శిస్తారు. కొండ కింద నుంచి పైకి ఏనుగు స్వారీ(ఐచ్ఛికం) ఉంటుంది. ఈ మార్గంలో హవా మహల్, జల్ మహల్ చూడవచ్చు. లంచ్ తర్వాత సిటీ ప్యాలెస్ మ్యూజియం, అబ్జర్వేటరీని సందర్శిస్తారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి జైపూర్ హోటల్ లో బస చేస్తారు.డే 3 : జైపూర్ - రణథంబోర్ : బ్రేక్ ఫాస్ట్ తర్వాత సవాయి మాధోపూర్‌కి బయలుదేరతారు. మధ్యాహ్న భోజన సమయానికి సవాయి మాధోపూర్‌కు చేరుకుంటారు. హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రణథంబోర్ నేషనల్ పార్క్‌ను సందర్శిస్తారు. వాహనంపై నేషనల్ పార్క్ లో సఫారీ ఉంటుంది. రాత్రి బస కోసం హోటల్‌కు తిరిగి వస్తారు.డే 4 :రణథంబోర్ - భరత్‌పూర్ : బ్రేక్ ఫాస్ట్ తర్వాత భరత్‌పూర్‌కు బయలుదేరి భోజన సమయానికి చేరుకుంటారు. అక్కడ హోటల్ చెక్ ఇన్ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత కీల్డియో బర్డ్ నేషనల్ పార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్‌ని సందర్శిస్తారు. రాత్రి బస కోసం హోటల్ కు తిరిగి వెళ్లాలి.డే 5 : భరత్‌పూర్ - దీగ్ - సరిస్కా: బ్రేక్ ఫాస్ట్ తర్వాత వయా డీగ్ సరిస్కాకు బయలుదేరతారు. డీగ్ ప్యాలెస్ సందర్శిస్తారు. మధ్యాహ్న భోజన సమయానికి సరిస్కాకు చేరుకోండి. హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత వాహనంలో సరిస్కా అభయారణ్యం సందర్శిస్తారు. రాత్రికి సరిస్కాలోని హోటల్ లో బస చేస్తారు.డే 6 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత జైపూర్ కు తిరుగు ప్రయాణం అవుతారు. జైపూర్ ఎయిర్‌పోర్ట్ / రైల్వే స్టేషన్ / బస్ స్టేషన్ వద్ద పర్యాటకులను డ్రాప్ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది.రణథంబోర్ నేషనల్ పార్క్ ను కోర్ ఏరియాలు, బఫర్ జోన్‌లుగా విభజిస్తారు. పులులు స్వేచ్ఛగా సంచరించే ప్రాంతాలను కోర్ ఏరియాస్ అంటారు. పులుల నివాసాలను రక్షించడానికి ఈ ప్రాంతాల్లో అటవీ నిర్మూలన, ఇతర వాణిజ్య కార్యకలాపాలు నిషేధం. బఫర్ జోన్‌లు రిజర్వ్‌లోని ప్రాంతాలు, ఇక్కడ స్థానిక ప్రజలు వ్యవసాయం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. పర్యాటకులు రణథంబోర్ నేషనల్ పార్క్ పులుల వీక్షణ కోసం 10 జోన్‌లుగా విభజించారు. జోన్‌లు 1-5 ప్రధాన ప్రాంతాలు, జోన్‌లు 6-10 బఫర్ జోన్‌లో భాగంగా ఉన్నాయి. 3, 4, 5 జోన్‌లు చాలా ప్రాచుర్యం పొందాయి. వేసవిలో నీటి వనరులు కోసం ఈ మండలాల్లో పులులు సులభంగా కనిపిస్తాయి.
జైపూర్ లో చూడదగిన ప్రదేశాలు
జైపూర్ సిటీ ప్యాలెస్ : ఓల్డ్ జైపూర్ నడిబొడ్డున ఉన్న సిటీ ప్యాలెస్ రాజ్‌పుత్, మొఘల్ ఆర్కిటెక్చర్‌ల సమ్మేళనానికి అద్భుతమైన ఉదాహరణ. జైపూర్ మహారాజా జై సింగ్ ఈ విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించారు. పూర్వపు రాజకుటుంబానికి చెందిన నివాస గృహాలు ఇందులో చూడవచ్చు. ఇందులో దివాన్-ఎ-ఆమ్ (రాజు ప్రజలతో మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన హాల్), దివాన్-ఎ-ఖాస్ (రాజు వ్యక్తిగత సమావేశాల కోసం హాల్), ముబారక్ మహల్, మహారాణి ప్యాలెస్ చూడవచ్చు. ముబారక్ మహల్‌లో మహారాజా సవాయి మాన్ సింగ్-II మ్యూజియం ఉంది. ఇందులో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిగత వస్తువులు, వస్త్రాలు వంటి సున్నితమైన ఎంబ్రాయిడరీలు నేటికీ ఉన్నాయి. మహారాణి ప్యాలెస్ దేశంలోని అతిపెద్ద ఆయుధాల సేకరణలలో ఒకటి. దివాన్-ఎ-ఖాస్ వద్ద రెండు భారీ వెండి పాత్రలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి 1.6 మీటర్ల పొడవు, ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వస్తువులుగా చెబుతున్నారు. రాజ కుటుంబం కోసం గంగానది నుంచి పవిత్ర జలాన్ని వీటిల్లో రవాణా చేసేవారు. ఈ ప్యాలెస్ లో ఇంకా అనేక అరుదైన కళాకృతులను చూడవచ్చు.
జంతర్ మంతర్ : జైపూర్ ఉన్న జంతర్ మంతర్ ప్రపంచంలోని పురాతన ఖగోళ అబ్జర్వేటరీలలో ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీన్ని గుర్తించింది. జంతర్ మంతర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్‌డయల్ ఉంది. జంతర్ మంతర్ వద్ద 16 పరికరాలు ఉన్నాయి, ఇవి సమయాన్ని కొలవడానికి, సూర్యుని చుట్టూ ఉన్న గ్రహాల కదలికలను గమనించడానికి ఖగోళ వస్తువులను ట్రాక్ చేయడానికి నిర్దేశించినవి. మహారాజా సవాయి జై సింగ్-II నిర్మించిన ఐదు ఖగోళ అబ్జర్వేటరీలలో ఇది అతిపెద్దది. ఐదింటిలో మూడు దిల్లీ, వారణాసి, ఉజ్జయినిలో చూడవచ్చు. జైపూర్‌ను స్థాపించిన జై సింగ్‌కు ఖగోళ శాస్త్రంలో చాలా ఆసక్తి ఉండేది. జంతర్ మంతర్ నిర్మాణాన్ని ప్రారంభించే ముందు, అతను తన పండితులను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి అబ్జర్వేటరీలలో అధ్యయనం చేయడానికి పంపారు. వీటితో అంబర్ ఫోర్ట్ వద్ద ల్యాండ్ స్కేప్ గార్డెన్, మండవ ఫోర్ట్ వీక్షించవచ్చు.