Revanth on Jagan: జగన్‌ చచ్చిన పాము లాంటోడు, చంద్రబాబును ఖతం చేయాలనుకుని ఖతమయ్యారన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి

4 months ago 72
ARTICLE AD

Revanth on Jagan: వ్యక్తిగత పగలు తీర్చుకోడానికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారనే సంగతి జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉంటుందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగన్ చచ్చిన పాము వంటి వాడని, రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్‌కు అక్కడి ప్రజలు గుణపాఠం నేర్పారని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టీగా మాట్లాడిన రేవంత్‌ రెడ్డి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేవారు.

ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసిన పనుల్ని ప్రజలు హర్షించలేదని నిరూపించడానికే ఇటీవల ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చారన్నారు. చేసిన పాపాలే ఎవరినైనా వెంటాడుతాయన్నారు.

జగన్‌కు ఏపీ ప్రజలు 150కి పైగా సీట్లు ఇచ్చినప్పుడు నమ్మ కంతో ఇచ్చారని, అదే ప్రజలు ఆయన తప్పు చేస్తున్నారని భావించి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. జగన్ వ్యవహార శైలే ఆయన్ను దెబ్బతీసిందని, ఢిల్లీలో తనను కలిసిన వైసీపీ ఎంపీలను తిట్టిపోశారని, అలాంటి వారు ఇతర పార్టీల్లో చేరి గెలిచారన్నారు. జగన్ చర్యల వల్ల ఏపీలో పరిశ్రమలు దెబ్బతిన్నాయని, ఆ రాష్ట్రం కూడా దెబ్బ తిన్నదని చెప్పారు.

కూల్చివేతలతో సంబంధం లేదు…

ఏపీలో సిఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నా.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదన్నారు. ఇటీవల లోటస్‌పాండ్‌లో నిర్మాణాల కూల్చివేతలో తన ప్రమేయం లేదని రేవంత్ స్పష్టం చేశారు. ఓడిపోయిన జగన్ ఇంటిని కూల్చాలని ఎవరైనా చెబితే తానెందుకు వింటానన్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే తాను ఆదేశాలు ఇచ్చానని దుష్ప్రచారం చేశారన్నారు.

ఓ మంత్రి చెప్పడంతోనే అధికారులు ఆ పనిచేశారని, వెంటనే వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఒక మంత్రి పట్టుబట్టి, అధికారులను ఒత్తిడి చేసి జగన్ లోటస్‌పాండ్‌ ఇంటి వద్ద కట్టడాలను కూల్చి వేయించారని.. ఆ మంత్రికి వైవీ సుబ్బారెడ్డి 50 సార్లు ఫోన్ చేసి ఆపించే ప్రయత్నం చేశారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి ద్వారా కూడా రాయబారం నడి పారని రేవంత్ చెప్పారు. కూల్చివేతల వి షయం తనకు తెలిసిన వెంటనే సదరు అధికారిని జీఏడీకి అటాచ్ చేశానని తెలిపారు.

టీడీపీ పోటీ చేసి ఉంటే…

చంద్రబాబుతో ఏపీకోసం పనిచేస్తే తనకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీచేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉండేదనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తే కనీసం 10 శాతం ఓట్లు ఆ పార్టీకి దక్కేవన్నారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపేదన్నారు.

ఏపీలో చంద్రబాబునాయుడుకు 2019లో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చినా కోర్‌ రాజకీయాలను వదలకుండా ఐదేళ్లు పోరాడారని, అందుకే మళ్లీ భారీ విజయం సాధించారన్నారు.

కక్షలు, కేసులతో పనులు కావు..

గత ప్రభుత్వంపై కేసులు పెడితే దాని పర్యావసానాలు చాలా ఉంటాయన్నారు. అది రాష్ట్రంపై పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒక్కో శాఖలో ఎందరిపై చర్యలు తీసుకోగలమన్నారు. ఇలాంటి పనుల వల్ల బ్యాంకు రుణాలు రావని, సాంకేతిక సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వం అంటే కేసీఆర్ ఒక్కరే ఉండరన్నారు. కక్ష సాధింపులు పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఏపీలో చేసినట్టు రాక

ఏపీ రాజధానిగా నిర్మిస్తోన్న అమరావతి హైదరాబాద్‌‌కు పోటీ కాదన్నారు. హైదరా‌బాద్‌ నగరంలోనే ఒకవైపు ఉన్న వారు మరోవైపు వెళ్లడానికి ఇష్ట పడటంలేదని హైదరాబాద్‌ వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారని తాను భావించడం లేదన్నారు. పెట్టుబడులకు అమరావతిలో లాభం ఉంటే తాడుతో కట్టేసినా ఆగకుండా అక్కడికే వెళ్తారని చెప్పారు. హైదరాబాద్‌ చుట్టూ డ్రై పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని, ఎగుమతులు, దిగుమతులకు గ్రీన్ ఫీల్డ్ హైవేలు వేస్తున్నాయని చెప్పారు.

Read Entire Article