Rythu Runa Mafi : రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్- 5 లక్షల మంది వివరాలు సేకరణ, త్వరలో నిధులు జమ

1 week ago 16
ARTICLE AD

Rythu Runa Mafi : తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం..మరో అవకాశం కల్పించింది. మూడు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ల పేర్లలో తప్పుల వల్ల మరో 1.50 లక్షల మందిని నిర్థారించారు. మొత్తం 5 లక్షలకు పైగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఆమోదం తెలపగానే వీరందరికీ రుణమాఫీ రూ.5 వేల కోట్లు అకౌంట్లలో జమ అవ్వనుంది.

రుణమాఫీ కానీ రైతులకు అడ్డంకులు తొలగాయి. రేషన్ కార్డులేని అన్నదాతలకు రుణమాఫీకి లైన్‌ క్లియర్ అయ్యింది. క్షేత్ర స్థాయిలో అధికారులు లెక్కలు బయటకు తీశారు. గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ అధికారులు చేపట్టారు. ఇలా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులను అధికారులు గుర్తించింది.

ఆధార్, బ్యాంకులో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరిచేశారు. దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని, ఆధార్, బ్యాంకులో పేర్ల తప్పుల కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ అవుతాయి.

రూ.2 లక్షల వరకు రుణమాఫీ

జులై 18న అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.1 లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేశారు. వడ్డీతో పాటు.. లక్ష వరకు ఉన్న రుణం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. జులై 31వ తేదీ నుంచి రూ.1.50 లక్షల రుణం ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. జులై 31 వరకు మొత్తం 18 లక్షలకు పైగా రైతులకు లబ్ధి చేకూరిందని వివరాలు వెల్లడించింది.

రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకున్న రుణాలను ఆగస్టు 14 తేదీలోపు మాఫీ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి రుణమాఫీ లిస్ట్ అధికారులు విడుదల చేశారు. కానీ.. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఇంకా మాఫీ కాలేదు. దీంతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read Entire Article