Sircilla News : రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్

6 months ago 174
ARTICLE AD

Sircilla News : రాజన్నసిరిసిల్ల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్ రావు ఏసీబీకి చిక్కారు. ఎంబీ రికార్డుపై అధికారులకు పంపించేందుకు ఏడు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భాస్కర్ రావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు పంచాయతీ రాజ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

గంభీరావుపేట మండలం లింగన్నపేటలో స్మశాన వాటిక కంపౌండ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్ వెంకటేష్ కు సుమారు ఐదు లక్షల బిల్లు రావాల్సి ఉంది. బిల్లు కోసం ఎంబీ రికార్డు ఏఈ, డీఈలు పూర్తి చేశారు. పై అధికారులకు పంపించేందుకు బాస్కర్ రావు రూ.8 వేలు డిమాండ్ చేశారు. వెంకటేష్ బతిమాలడంతో వెయ్యి తగ్గించి ఏడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్ రావు. డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడంతో వెంకటేష్ ఏసీబీ ఆధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వెంకటేష్ నుంచి సోమవారం సిరిసిల్లలోని పంచాయతీ రాజ్ ఈఈ కార్యాలయంలో భాస్కర్ రావు ఏడు వేలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెంట్ గా పట్టుకున్నారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రికార్డు సీజ్ చేసి మంగళవారం భాస్కర్ రావును కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రజాప్రభుత్వం అవినీతి అధికారుల భరతం పట్టాలి

సిరిసిల్లలో పంచాయితీ రాజ్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావును ఏసీబీకి పట్టించిన కాంట్రాక్టర్ వెంకటేష్, ప్రజాప్రభుత్వం అవినీతి అధికారుల భరతం పట్టాలని కోరారు. తన ఒక్కన్నే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఉద్యోగులు లంచాలు తినమరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ పనిచేసిన దానికి ఎంబీ రికార్డు పుర్తై సీపీవోకు ఫైల్ పంపించేందుకు రూ.8 వేలు డిమాండ్ చేశాడని తెలిపారు. జోగినిపల్లి భాస్కర్ రావు వేధింపులు భరించలేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు. తనలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

Read Entire Article