Telangana News Live November 29, 2024: BRS Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్

3 weeks ago 25
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live November 29, 2024: Brs Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్

 తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్

BRS Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్(Photo From Komatireddy Venkat Reddy FB)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 29 Nov 202403:30 PM IST

తెలంగాణ News Live: BRS Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే... ఇంకెవరూ కాదు - దీక్షా దివాస్ లో కేటీఆర్

తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరముందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడని విమర్శించారు. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202402:44 PM IST

తెలంగాణ News Live: TGPSC DAO Results : డీఏవో ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

TGPSC DAO Results 2024: డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) గ్రేడ్‌-2 ఫలితాలు వచ్చేశాయ్. ఈ మేరకు తుది జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో పొందుపర్చింది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202402:17 PM IST

తెలంగాణ News Live: TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు తొలుత వారికే..! గదుల నిర్మాణంపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

ఇందిరమ్మ ఇండ్లపై  అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇండ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ల‌బ్ధిదారు ఆస‌క్తి చూపితే అద‌న‌పు గ‌దుల నిర్మాణానికి అనుమ‌తి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202401:06 PM IST

తెలంగాణ News Live: Singareni Recruitment 2024 : సింగరేణిలో 64 ఇంటర్నల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

SCCL Recruitment 2024 : సింగ‌రేణిలో ఇంట‌ర్న‌ల్ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. 64 జూనియ‌ర్ స‌ర్వే ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన వారు డిసెంబర్ 7వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202412:04 PM IST

తెలంగాణ News Live: TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - డిసెంబర్ 26న హాల్ టికెట్లు విడుదల

TG TET 2024 Exam Hall Tickets : తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 2 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202411:56 AM IST

తెలంగాణ News Live: Siddipet Tragedy : ప్రాణం తీసిన కరెంట్.. ఆ యువతికి పుట్టిన రోజే చివరి రోజైంది

Siddipet Tragedy : తన పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడపాలనుకుంది. కానీ అదే చివరి రోజని గ్రహించలేకపోయింది. కరెంట్ రూపంలో మృతువు ఆ యువతిని బలి తీసుకుంది. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202411:06 AM IST

తెలంగాణ News Live: Winter Care : చలికాలంలో సొంత వైద్యం ముప్పు.. ఈ 7 జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మేలు!

Winter Care : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా వారం రోజుల నుంచి చలి విపరీతంగా పెరిగింది. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు జాగ్రత్తలు చెబుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202408:27 AM IST

తెలంగాణ News Live: Charlapalli railway station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం రేపే.. ఈ రైళ్ల రాకపోకల్లో మార్పులు!

Charlapalli railway station : చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ రేపు ప్రారంభం కానుంది. రైల్వే శాఖమంత్రి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతోందని అధికారులు చెబుతున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202408:26 AM IST

తెలంగాణ News Live: Lagacharla Lands : లగచర్లలో భూసేకరణ రద్దు - రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

లగచర్లలో భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో…. భూసేకరణను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరణ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు పేర్కొంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202407:52 AM IST

తెలంగాణ News Live: Hyderabad Eco Park : మన హైదరాబాద్‌లో అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్‌.. వీకెండ్‌లో ఓ లుక్కేయండి

Hyderabad Eco Park : నగర ప్రజలకు అందమైన ప్రకృతిని ఆస్వాదించే అవకాశం వస్తోంది. అవును.. హైదరాబాద్ శివారులోని అక్వేరియం ఎకో పార్క్‌ ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చేనెలతో దీన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సముద్ర జీవులతో అక్వేరియం ప్రత్యేక ఆర్షణగా నిలవనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202406:12 AM IST

తెలంగాణ News Live: Adilabad : పులి దాడిలో మహిళ మృతి.. బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు భయపెడుతున్నాయి. తాజాగా.. కాగజ్‌నగర్ మండలంలో మహిళపై పులి దాడి చేసింది. బోథ్ మండలం బాబెర తాండలో చిరుతపులి సంచారం హడలెత్తిస్తుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పులుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202403:50 AM IST

తెలంగాణ News Live: Mulugu New Mandal: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం, మంత్రి సీతక్క చొరవతో నెరవేరిన కల

Mulugu New Mandal: ములుగు జిల్లాలోని మల్లంపల్లి వాసుల కల ఎట్టకేలకు నెరవేరింది. మల్లంపల్లిని ప్రత్యేక మండల కేంద్రంగా ప్రకటించాలని కొన్నేళ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తుండగా.. స్థానిక మంత్రి సీతక్క చొరవతో మల్లంపల్లి ప్రజల కోరిక నెరవేరింది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202403:27 AM IST

తెలంగాణ News Live: Kazipet Coach Factory: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ * ఓరుగల్లు దశాబ్దాల నిరీక్షణకు తెర

Kazipet Coach Factory: ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలకమైన కాజీపేట జంక్షన్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చర్ యూనిట్‌ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రెడ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202402:35 AM IST

తెలంగాణ News Live: Khammam School: ఆ సర్కారు స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి.. ఏడాది నిర్వహణ ఖర్చు రూ.12.84 లక్షలు.!

Khammam School: ఆ స్టూడెంట్ చాలా స్పెషలండోయ్! ఎందుకో తెలుసా? ఆ విద్యార్థిని చదివేది ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతే అయినా లక్షల ధనం ఖర్చవుతోంది. ఆ పాప కోసం సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.12.84 లక్షలు! అదేంటి ప్రభుత్వ పాఠశాల కదా.. లక్షల్లో ఖర్చు ఏంటనుకోకుండా ఈ స్టోరీ చదవండి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 29 Nov 202401:35 AM IST

తెలంగాణ News Live: TG Raithu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌, త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

TG Raithu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని, రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం నల్గొండ జిల్లా కేంద్రంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

WhatsApp channel

Read Entire Article