Telugu Student Dies In USA : అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ!

4 months ago 130
ARTICLE AD

Telugu Student Dies In USA : అమెరికాలోని మిస్సౌరీలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ!

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ!

Telugu Student Dies In USA : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మరణించాడు. హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్ రాజ్ చికాగో మిస్సౌరీ ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో యువకుడు గల్లంతు ఘటనలో తెలంగాణకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రాజు శ్రీనాథరాజు (20) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చికాగోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

ఈత రాకపోవడంతో

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. కిరణ్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గత ఏడాది నవంబర్ లో అమెరికా వెళ్లాడు. జూన్ 28న మిస్సౌరీలోని సాండ్ హిల్ టౌన్ సమీపంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ కొలనులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కిరణ్ నీటిలో మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలించలేదు. కిరణ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల కిరణ్ కుమార్ రాజు తాను Dev Opsలో సర్టిఫికేషన్ పూర్తి చేసినట్లు తన లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఘోరప్రమాదం చోటుచేసుకుంది.

గతంలో తండ్రి మృతి

కిరణ్ కుమార్ రాజు అకాల మరణంతో అతడి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కిరణ్ తండ్రి లక్ష్మణ్ రాజు గతంలో మరణించగా, తల్లి హైదరాబాద్‌లో నివాసిస్తున్నారు. కిరణ్ తాత కృష్ణమూర్తి రాజు యువకుడి చదువుకు సహకరిస్తున్నారు. కిరణ్ సెయింట్ లూయిస్‌లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతడు హైదరబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చికాగోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. కిరణ్ బంధువులతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. ఈ కష్ట సమయంలో అవసరమైన సహాయాన్ని అందజేస్తున్నట్లు పేర్కొంది.

Read Entire Article