ARTICLE AD
TG DSC 2024 Results: తెలంగాణ డిఎస్సీ 2024 పరీక్షలకు హాజరైన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. రెండు నెలలకు పైగా అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ డిఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 12 గంటలకు సచివాలయంలో విడుదల చేశారు.
తెలంగాణ డిఎస్సీ ఫలితాలను ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు…
అభ్యర్థులకు సందేహాలు ఉంటే ఈ నంబర్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు…
Technical Support Number: +91-9154114982/+91-6309998812 & Mail ID: helpdesktsdsc2024@gmail.com
రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిం చింది. ఫలితాలు వీలైనంత త్వరగా విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షలు పూర్తై 3 వారాలు దాటడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో సోమవారం ఉదయం ఫలితాలను విడుదల చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. డిఎస్సీ 2024 ప్రాథమిక కీని ఆగస్టు 13న విడు దల చేశారు. ఆగస్టు 20 వరకూ ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు 28 వేల అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీ విడుదల చేశారు.
మరోవైపు ఫైనల్ కీలోనూ తప్పులు న్నాయని కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వీటిపై ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో సమీక్షించారు.అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత వారంలోగా ఫలితాలు వెలువడతామయని భావించానా ఆలస్యమైంది. ఇప్పటికే మూడు వారాలు దాటిపోయిందని ఆందోళన వ్యక్తమైంది. అనూహ్యంగా సోమవారం ఉదయం ఫలితాలు వెలువరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు డీఎస్సీ జనరల్ ర్యాకిం గ్ జాబితాలు విడుదల చేస్తే నియామక ప్రక్రియ ముందుకు వెళుతుంది. ఖాళీలను బట్టి 33 జిల్లాల్లో ద్రువపత్రాల పరిశీలన చేపట్టాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి జాబితాలు వెళతాయి. ఈ మొత్తం ప్రక్రియకు మరో మూడు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో మరో 10 వేల మంది ఉపాధ్యాయులు తెలంగాణలో ఉద్యోగ విరమణ చేస్తారు. 56 రోజుల్లోనే డిఎస్సీ ఫలితాలు వెలువరిస్తున్నట్టు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణ డిఎస్సీ ఫలితాలను ఈ లింకు ద్వారా తెలుసుకోండి…