TG Food Safety: హైటెక్ సిటీ రెస్టారెంట్లు, తిన్నారంటే అంతే సంగతులు, 𝗘𝘅𝗼𝘁𝗶𝗰𝗮, 𝗠𝗶𝗻𝗴 𝗨𝘀𝘁𝗮𝗱లలో ఘోరం

6 months ago 113
ARTICLE AD

TG Food Safety: హైదరాబాద్‌ రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్ తనిఖీల్లో పేరొందిన రెస్టారెంట్ల నిర్వాకం బయటపడింది. టాస్క్ ఫోర్స్ బృందం రెండ్రోజులుగా కొండాపూర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. హైటెక్‌ సిటీలోని 𝗘𝘅𝗼𝘁𝗶𝗰𝗮 రెస్టారెంట్‌లో జరిపిన సోదాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు.

స్టోర్ రూమ్‌లో బొద్దింకలు తిరగడాన్ని అధికారులు గుర్తించారు. ఎక్సోటికాలోమాంసం నిల్వ చేసేందుకు ఉపయోగించే రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.రెస్టారెండ్‌ ప్రాంగణంలో FSSAI లైసెన్స్ ఒరిజినల్ కాపీని ప్రదర్శించారు.

ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్‌నెట్‌లు, యూనిఫాం ధరించి ఉన్నారని, రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ చేసిన న ఆహార పదార్ధాలు ప్యాకింగ్‌లలో ఉన్నా వాటిపై తయారీ తేదీలు లేవని గుర్తించారు. కూరగాయలు కోసే ప్రదేశంలో మూతలు లేకుండా డస్ట్‌బిన్‌లు కనిపించాయిని, ఫుడ్ హ్యాండ్లర్‌ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

హైటెక్‌ సిటీలో ఉన్న మింగ్ ఉస్తాద్‌ 𝗠𝗶𝗻𝗴 𝗨𝘀𝘁𝗮𝗱 రెస్టారెంట్‌లో FSSAI లైసెన్స్ అసలు ప్రతిని రెస్టారెంట్‌ ప్రాంగణంలో ప్రదర్శించలేదు. పుట్టగొడుగులు (200గ్రా) & కసూరి మేతి (360గ్రా) గడువు ముగిసినట్లు గుర్తించి అక్కడే పడేశారు. ఫుడ్ హ్యాండ్లర్లలో కొందరు హెయిర్‌నెట్‌లు ధరించకుండా ఉండటం గుర్తించారు.

రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ చేసిన ప్రాసెస్డ్‌ ఆహార పదార్ధాలను గడువు తేదీల వారీగా భద్రపరచలేదు. శాఖాహారం, మాంసాహారాలను ఒకే రిఫ్రిజిరేటర్‌లో కలిసి నిల్వ చేశారు. డస్ట్‌బిన్‌లు సరైన మూతలు లేకుండా తెరిచి ఉన్నాయని పేర్కొన్నాయి.

వైరల్‌‌గా మారిన ఫోటోలు, వీడియోలు..

హైటెక్‌ పరిసరాల్లో నిత్యం రద్దీగా ఉండే రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఫోటోలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ రెస్టారెంట్లలో నిత్యం ఎగబడి తినే ఐటీ ఇంజనీర్లు రిప్లైలు, మీమ్స్‌‌తో వైరల్ చేస్తున్నారు.

Task force team has conducted inspections in Kondapur area on 27.07.2024.

𝗘𝘅𝗼𝘁𝗶𝗰𝗮, 𝗛𝗶-𝗧𝗲𝗰𝗵 𝗖𝗶𝘁𝘆

* Live cockroach infestation observed inside store room.

* The refrigerator used to store meat was found unhygienic.

* FSSAI License true copy was displayed at… pic.twitter.com/WW3VRHvnsm

— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) July 29, 2024

WhatsApp channel

Read Entire Article