ARTICLE AD
TG IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 44 మంది ఐఏఎస్‌ల బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‍ల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 44 మంది ఐఏఎస్‍లను బదిలీ చేస్తూ జీవో నంబర్ 876 జారీ చేశారు. జీహెచ్‍ఎంసీ కమిషనర్‍గా ఆమ్రపాలిని నియమించారు. పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ.. క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యార్‌ను నియమించారు.
హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండీ క్రాప్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌కు పోస్టింగ్ ఇచ్చారు. టీపీటీఆర్ ఐ డీజీగా అహ్మద్ నదీమ్‍కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా నియమించారు. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా సందీప్ ను నియమించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వి - జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది అధికారులను బదిలీ చేశారు.