ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Tg Icet 2024 Live News Updates: తెలంగాణ ఐసెట్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఐసెట్ ఫలితాలు 2024
TG ICET 2024 Live News Updates: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులను పొందవచ్చు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలను ప్రకటిస్తారు.
Fri, 14 Jun 202411:38 AM IST
జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. కాగా తెలంగాణ ఐసెట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
Fri, 14 Jun 202411:38 AM IST
ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6 వేల 990 సీట్లు ఉన్నాయి. ఐసెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
Fri, 14 Jun 202411:37 AM IST
ఐసెట్ పరీక్ష కోసం 86 వేల 156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77 వేల 942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.
Fri, 14 Jun 202410:30 AM IST
తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ వర్శిటీ నిర్వహించింది. కాసేపట్లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
Fri, 14 Jun 202410:18 AM IST
తెలంగాణ ఐసెట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులను పొందవచ్చు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలను ప్రకటిస్తారు.
Fri, 14 Jun 202409:47 AM IST
Fri, 14 Jun 202408:32 AM IST
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహిస్తోంది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి.
Fri, 14 Jun 202408:32 AM IST
తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.
Fri, 14 Jun 202408:31 AM IST
తెలంగాణ ఐసెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్ష కేయూ నిర్వహించింది.
Fri, 14 Jun 202407:24 AM IST
మరికాసేపట్లో తెలంగాణ ఐసెట్ ఫలితాల విడుదల
తెలంగాణ ఐసెట్ ఫలితాలను మరికాసేపట్లో ఉన్నత విద్యా మండలి విడుదల చేయనుంది. జూన్ 5,6 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు.
Fri, 14 Jun 202406:49 AM IST
ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో ఐసెట్ ఫలితాలు
తెలంగాణ ఐసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.
Fri, 14 Jun 202405:44 AM IST
నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాల విడుదల
తెలంగాణ ఐసెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదల కానున్నాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు.
Fri, 14 Jun 202404:51 AM IST
తెలంగాణ ఐసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..
తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోంపేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) పరీక్షలను ఈ ఏడాది కాకతీయ వర్శిటీ నిర్వహిస్తోంది. తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 5 నుంచి 6వ తేదీ వరకు పలు సెషన్లల్లో జరిగాయి.
Fri, 14 Jun 202404:44 AM IST
జూన్ 5,6 తేదీల్లో ఐసెట్ పరీక్ష
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ నెల 5, 6 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ కీ కూడా అందుబాటులోకి వచ్చింది.
Fri, 14 Jun 202404:27 AM IST
తెలంగాణ ఐసెట్ ర్యాంకులతో పాటు మార్కులు కూడా ప్రకటించనున్నారు. టాప్ టెన్ ర్యాంకర్ల జాబితాను కూడా నేడు విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Fri, 14 Jun 202404:26 AM IST
ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి
తెలంగాణ ఐసెట్ -2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదల కానున్నాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ కలిసి శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు.
Fri, 14 Jun 202404:19 AM IST
మార్చి 27 నుంచి రిజిస్ట్రేషన్లు
తెలంగాణలోని యూనివర్శిటీ అనుబంధ కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్–2024(TS ICET 2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 7వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించారు.
Fri, 14 Jun 202404:18 AM IST
రెండు రాష్ట్రాల్లో ఐసెట్ పరీక్ష
తెలంగాణ ఐసెట్-2024 పరీక్షను తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 20 ఆన్ లైన్ టెస్ట్ జోన్లను(Exam Centers) ఏర్పాటు చేశారు. తెలంగాణ 16 చోట్లా, ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్లా పరీక్షను నిర్వహించారు.
Fri, 14 Jun 202404:17 AM IST
జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ పరీక్ష
తెలంగాణ ఐసెట్–2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ (TG ICET Exam)ను ఆన్ లైన్ లో నిర్వహించారు. ఐసెట్ పరీక్షను రెండు రోజుల్లో మూడు సెషన్ లలో నిర్వహించారు. జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించారు.
Fri, 14 Jun 202404:16 AM IST
నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాలు
తెలంగాణ ఐసెట్ 2024 ఫలితాలను నేడు ఉన్నత విద్యా మండలి విడుదల చేయనుంది.