ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Tg Iti Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే
Telangana ITI Admissions 2024 : తెలంగాణలోని ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ ఐటీఐ ప్రవేశాలు (image source https://iti.telangana.gov.in/)
Telangana ITI Admissions 2024 : తెలంగాణలో ఈ ఏడాదికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఉపాధి- శిక్షణ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 సెషన్‌కు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. జూన్ 10వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
ఐటీఐ ప్రవేశాల ముఖ్య వివరాలు:
ప్రవేశాల ప్రకటన - ఉపాధి- శిక్షణ కమిషనర్ కార్యాలయం, తెలంగాణ రాష్ట్రంకోర్సులు - ఐటీఐ కోర్సు (2024-25)అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్నింటినికి 8వ తరగతిని విద్యా అర్హతగా నిర్ణయించారు.ట్రేడ్ - ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్వయోపరిమితి - 14 ఏళ్లు నిండి ఉండాలి.సీట్ల కేటాయింపు - అకడమిక్ మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోదరఖాస్తులు రుసుం - రూ. 100 చెల్లించాలి.దరఖాస్తులు ప్రారంభం - 16 మే , 2024దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 10 జూన్ , 2024.ఆన్ లైన్ దరఖాస్తులో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దు. ముఖ్యంగా సరైన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.అధికారిక వెబ్ సైట్ - https://iti.telangana.gov.in/దరఖాస్తు ఫారమ్ లింక్ - https://tsiti.ucanapply.com/ఏపీలో ఐటీఐ ప్రవేశాలు…
AP ITI Admissions 2024 Notification: ఏపీలోని ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్ కార్యాలయం వివరాలను పేర్కొంది. 2024-2025 సెషన్‌కు గాను ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశాలను కల్పించనుంది.
ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పదో తరగతిలో పాస్ అయిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయ్ చేసుకోవచ్చు. https://iti.ap.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.