TG Medical Jobs : వైద్యశాఖలో ఖాళీలపై ప్రభుత్వం దృష్టి, 755 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు!

5 months ago 86
ARTICLE AD

TG Medical Jobs : తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ ఆసుప‌త్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీపై దృష్టిసారించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వ‌ర్షాకాలంలో డెంగీ, ఇత‌ర విష జ్వరాలు ప్రబ‌లుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఖాళీల భ‌ర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల కొర‌త ఎక్కువ‌గా ఉంది. స‌మ‌స్యను అధిగ‌మించి ప్రజ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులు 531 భ‌ర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవ‌ల నియామ‌క బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్‌బీ) త్వర‌లోనే పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. నియామ‌కాల అనంత‌రం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా స‌ర్జన్లను నియ‌మించ‌నున్నారు. వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియ‌న్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 193 ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అలాగే, వివిధ ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ‌లు అందించే స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు 31 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి ఎంహెచ్ఎస్ఆర్‌బీ నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది.

సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల పోస్టులు- 531ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టులు-193స్టాఫ్ న‌ర్సుల పోస్టులు-31

గ్రూప్-2 పై అప్డేట్

ఎన్నికల కోడ్ ముగియటంతో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తికాగా.. మెయిన్స్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇదే సమయంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీపై కూడా కసరత్తు షురూ చేసింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. జూన్ 16వ తేదీ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ ఆప్షన్ తో జూన్ 20వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులకు ఇదే చివ‌రి అవ‌కాశమ‌ని… ఎవ‌రైనా అభ్య‌ర్థులు త‌ప్పిదాలు చేస్తే స‌రి చేసుకోవాల‌ని కమిషన్ సూచించింది. ఎడిట్ ప్రక్రియ పూర్తయిన త‌ర్వాత త‌ప్పనిస‌రిగా త‌మ ద‌ర‌ఖాస్తును PDF ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది.

https://www.tspsc.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ ను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు(TSPSC Group 2) ఉంటాయని గతంలోనే కమిషన్ తెలిపింది.ఇక గ్రూప్2 కింద 783, గ్రూప్ 3 కింద 1388 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Read Entire Article