TG PGECET Results 2024 : తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా?

5 months ago 123
ARTICLE AD

TG PGECET Results 2024 : తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించారు. తాజాగా వీటి ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జేఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి పీజీఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పీజీఈసెట్‌ లో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు ఉండవు. వచ్చిన మార్కులు ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.

పీజీఈసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి?

Step 1 : అభ్యర్థులు ముందుగా పీజీఈసెట్ వెబ్ సైట్ https://pgecet.tsche.ac.in/ లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : హోంపేజీలోని ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 : అభ్యర్థి లాగిన్ వివరాలు-పీజీఈసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.

Step 4 : స్క్రీన్ పై పీజీఈసెట్ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. తర్వాత డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ కోర్సుల్లోప్రవేశాలు

తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET 2024) ద్వారా ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, జియోఇంజినీరింగ్ అండ్‌ జియోఇన్ఫర్మాటిక్స్‌, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ 19 విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. పీజీఈసెట్ లో వచ్చిన ర్యాంకులు ఆధారంగా ఆయా కోర్సుల్లో ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ స్థాయిల్లో ఫార్మ్‌డీలో అడ్మిషన్లు కల్పించనున్నారు.

టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ప్రకటన

టీజీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షలకు ఇటీవల తేదీలు ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటన చేశారు. గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు 3 రోజుల ముందుగా హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్-I, గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-II, షెడ్యూల్డ్ కులాభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వార్డెన్ గ్రేడ్-I, గ్రేడ్-II, మాట్రాన్ గ్రేడ్-I, గ్రేడ్-II, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డైరెక్టర్, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్‌లో పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ జనరల్ రిక్రూట్‌మెంట్ ఖాళీలకు మల్టీషిఫ్ట్‌లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ విధానంలో నిర్వహించనున్నారు.

Read Entire Article