ARTICLE AD
తెలంగాణ ప్రభుత్వం దసరా, బతుకమ్మ సెలవులను అధికారికంగా ప్రకటించింది. 13 రోజులు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 14 వరకు సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 15న తరగతులు పునః ప్రారంభం కానున్నాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో.. విద్యార్థులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
మే 25న తెలంగాణ ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా.. 13 రోజులు సెలవులను ప్రకటించింది. అటు ప్రైవేట్ స్కూళ్లు కూడా పేరెంట్స్‌కు సెలవుల గురించి సమాచారం ఇస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.
రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ స్కూళ్లలో సెప్టెంబర్ 30 వరకే తరగతులు జరగనున్నాయి. అక్టోబర్ 1వ తేదీన పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరపనున్నట్టు యాజమాన్యాలు వెల్లడించాయి. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి సెలవులు కావడంతో.. సెప్టెంబర్ 30న తరగతులు జరుగుతాయి. అటు విద్యార్థులు కూడా స్కూళ్లలో జరిగే బతుకమ్మ సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతున్నారు.
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 13 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అన్ని విద్యా సంస్థలు సెలువులు ఇవ్వాలని అదేశించింది. డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 29 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్‌లో స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అటు సంక్రాంతి సెలవులపై కూడా స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 10 నుండి జనవరి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.