ARTICLE AD
TG SSC Advanced Supplementary Results : ఇవాళ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.
జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను https://bse.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోవచ్చు...
విద్యార్థులు మొదటగా https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.హోంపేజీలో కనిపించే TG Advanced SSC Supplementary Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.మీ రోల్ నెంబర్ ఎంట్రీ చేయాలి.క్లిక్ బటన్ పై నొక్కితే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.ఇంటర్ లేదా ఇతర అడ్మిషన్ ప్రక్రియలో మెమో చాలా కీలకం.తెలంగాణలో పదో తరగతి పరీక్షలు(TS 10th Exams) మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాదికి 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,813మంది విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో 4,94,207మంది రెగ్యులర్ విద్యార్ధులు కాగా, మరో 11,606మంది విద్యార్ధులు ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాది తెలంగాణలో 4,91,82మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్ధుల్లో 91.31శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలురలో 89.42శాతం, బాలికల్లో 93.23శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత బాలురకంటే 3.81శాతం అధికంగా ఉంది. రెగ్యూలర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.
జూలై 6 నుంచి సీపీగెట్ పరీక్షలు….
తెలంగాణ సీపీగెట్ (TS CPGET 2024) పరీక్షల హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్జేట్ అందింది. జూలై 3వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇటీవలే సీపీగెట్ పరీక్షల షెడ్యూల్ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 17వ తేదీతో ఈ పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి.రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్ నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ నిర్వహిస్తున్నారు. మే 18 నుంచి జూన్ 17 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించారు.రూ.2 వేల ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.సీపీగెట్ పూర్తి వివరాలను www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్లలో చూడొచ్చు. ఈ లింక్స్ లోకి వెళ్లే హాల్ టికెట్లను కూడా పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడో సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచించారు.