ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Tgcab Recruitment : ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రకటన - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ!
TG Cooperative Apex Bank Jobs : ఇంటర్న్స్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. అప్లికేషన్ల గడువు ఇవాళ్టితో( నవంబర్ 30) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు https://tgcab.in/notifications/ లింక్ పై క్లిక్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కోఆపరేటివ్ ఇంటెర్న్స్ పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 10 ఖాళీలు ఉండగా… కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది.
ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే… తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లో కేవలం ఒక పోస్టు మాత్రమే ఉంది. మిగిలిన మరో 9 పోస్టులు డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నాయి. https://tgcab.in/notifications/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని… ఆఫ్ లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ను హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ట్రూప్ బజార్ బ్రాంచ్ ఆఫీస్,హైదరాబాద్ - 500001 లో సమర్పించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాదు, వరంగల్ జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.
అర్హతలు…
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్) లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.