TGPSC DAO Results : డీఏవో ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

1 month ago 60
ARTICLE AD

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) గ్రేడ్‌-2 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన వెలువరించింది. ఎంపికైన వారి జాబితాను వెబ్ సైట్ లో పొందుపర్చింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి తుది జాబితాను చెక్ చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది.

తుది జాబితాను మల్టీ జోన్ల వారీగా ప్రకటించారు. మల్డీజోన్ 1, మల్టీజోన్ - 2గా హాల్ టికెట్లను ప్రకటించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాత పరీక్షలు పూర్తి చేయటంతో… సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు.

ఇలా చెక్ చేసుకోండి

డీఏవో అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.హోం పేజీలోకి వెళ్లి Divisional Accounts Officer Provisional Selection Listపై క్లిక్ చేయాలి.ఎంపికైన వారి హాల్ టికెట్లు జాబితా డిస్ ప్లే అవుతుంది.ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

త్వరలోనే గ్రూప్ 3 ప్రాథమిక 'కీ'లు:

ఇటీవలే టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. గ్రూప్-3 పరీక్షల ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక 'కీ' లను త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో నవంబర్‌ 17,18 తేదీల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టులకు టీజీపీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగియడంతో... టీజీపీఎస్సీ కమిషన్‌ అధికారికంగా ప్రిలిమినరీ కీ విడుదల చేయనుంది. అనంతరం తుది విడుదల చేసి, ఫలితాలు విడుదల చేయనుంది. అయితే గ్రూప్ 1 ఫలితాల తర్వాతనే గ్రూప్ 3 తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Whats_app_banner

Read Entire Article