TGPSC New Chairman : తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం - ఉత్తర్వులు జారీ

3 weeks ago 31
ARTICLE AD

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్ బుర్రా వెంకటేశం పేరు ఖరారైంది. డిసెంబర్ 3వ తేదీన ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ఆయన విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

బుర్రా వెంకటేశం జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కీలక శాఖలను చూస్తున్నారు.  రాజ్‌భవన్ సెక్రటరీగా ఉండటంతో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 

గవర్నర్ ఆమోదముద్ర…

ప్రస్తుత ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి పదవీకాలం వచ్చేనెల 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. నవంబర్ 20వతేదీతో ప్రక్రియ పూర్తి అయింది.  ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ.. ఈ దరఖాస్తులను పరిశీలించి బుర్రా వెంకటేశం పేరును ఖరారు చేసింది. నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

మరోవైపు మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే టీజీపీఎస్సీ కమిషన్‌ సభ్యురాలు అనితా రాజేంద్ర, ఆ తర్వాత రామ్మోహన్‌రావు వరుసగా పద వీవిరమణ పొందనున్నారు. దీంతో టీజీపీఎస్సీ సగానికి పైగా ఖాళీ కానుంది. ఈ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు.

టీజీపీఎస్సీకి కొత్తగా 142 పోస్టులను క్రియేట్‌ చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల జీవో కూడా జారీ చేసింది. వీటిలో 73 పోస్టులను కొత్తగా రిక్రూట్‌ చేయనుండగా.. 58 పోస్టులను ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై ఫిల్ చేయనున్నారు. మిగతా 11 పోస్టులను పదోన్నతులిచ్చి నింపుతారని తెలుస్తోంది.దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Whats_app_banner

Read Entire Article