ARTICLE AD
TGRTC E garuda: బీహెచ్ఈఎల్ నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇకపై రాత్రి 9.30, 10.30కు బయల్దేర్దే ఈ గరుడ ఎలక్ట్రిక్ బస్సులు నగరంలోకి రాకుండా నేరుగా ఔటర్ మీదుగా విజయవాడ వైపు వెళ్లిపోతాయి. ఫలితంగా దాదాపు గంటన్నర ప్రయాణ సమయం కలిసి రానుంది. బీహెచ్‌ఈఎల్ నుంచి విజయవాడకు దాదాపు ఆరుగు గంటల్లోనే చేరకునే వీలు కలగనుంది.
విజయవాడ వైపు వెళ్లే ప్రయాణాన్ని మరింత వేగంగా చేరుకునేలా ఆర్టీసీ ఈ గరుడా బస్సుల్ని ఔటర్ మీదుగా నడపాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో బీహెచ్‌ఇఎల్-విజయవాడ మధ్య ప్రయాణంలో దాదాపు గంటన్నర సమయం కలిసి రానుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి వచ్చే బస్సులు హయత్ నగర్ వరకు వేగంగా చేరుకుంటున్నా అక్కడ నుంచి ఎల్‌బినగర్ మీదుగా బీహెచ్‌ఈఎల్ చేేరుకోడానికి రెండుగంటల సమయం పడుతోంది. పగటి పూట ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అంతే సంగతులు. ఇక రాత్రి ఏడు తర్వాత ఏ సర్వీసు బస్సులైనా నగరం నుంచి బయటకు వెళ్లడానికి గంటల కొద్ది సమయం పడుతోంది.
ఈ నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్ నుంచి విజయవాడ వెళ్లే ఈ బస్సుల్ని ఇకపై ఔటర్ మీదుగా నడపాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిపాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 సోమ వారం నుంచి రెండు ఎలక్ట్రానిక -గరుడ బస్సుల్ని ఓఆర్ఆర్ మీదుగా నడపనున్నారు.
ఈ నిర్ణయంతో ప్రయాణికులకు 1.15 గంటల నుంచి గంటన్నర వరకు సమయం కలిసి రానుంది. సుమారు 75-90 నిమిషాలు ముందే గమ్యస్థానానికి చేరుకోవచ్చని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా ఈ సర్వీసుల్ని ప్రారంభిస్తు న్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ తెలిపారు.
ఔటర్ మీదుగా ప్రయాణించే రెండు ఈ బస్సు సర్వీసులు రాంచంద్రాపురం, బీహెచ్ఎల్, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్డు , హౌసింగ్ బోర్డు మీదుగా జేఎన్టీయూ, రైతుబజార్, మలేషియన్ టౌన్‌షిప్ , మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఔటర్‌వైపు వెళ్తాయి.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా బీహెచ్‌ఈఎల్ నుంచి రోజూ రాత్రి 9.30, 10,30 గంటల నుంచి రామచంద్రాపురం నుంచి బయల్దేరతాయి. విజయవాడ వెళ్లే ప్రయాణికులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్ఎం సూచించారు. బీహెచ్ఈఎల్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ చేరుకోడానికి ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో 337 కిమీ దూరం ప్రయాణించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు లెక్కించారు.
హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-బీహెచ్‌ఈఎల్ సర్వీసులు 6.25 గంటల్లోనే చేరుకుంటునాయి. అమీర్‌పేట్, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ మీదుగా బీహెచ్ఎల్- విజయవాడకు 301 కిమీ. దూరం ఉంటుంది. ఔటర్ మీదుగా వెళితే మరో మరో 36 కిమీ దూరం పెరుగుతుంది. ప్రయాణ దూరం పెరిగినా సమయం తగ్గిపోతుంది. ఈ మార్గంలో బస్సు ఛార్జి మాత్రం గతంలో రూ.750 ఉండేది. ఈ ఛార్జీ పెంచలేదు. ప్రయణికులు చిక్కులు లేకుండా ఈ మార్గంలో ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది.