ARTICLE AD
TS DOST 2024 Phase 3 Registration: తెలంగాణలో దోస్త్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతల పూర్తి కాగా.. మూడో విడత ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు డిగ్రీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
'దోస్త్' మూడో విడత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ జూన్ 19 నుంచి ప్రారంభమైంది. జులై 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే రెండో విడతలో 41,533 మందికి డిగ్రీ సీట్లు పొందారు.
దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 1,066 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా ఈ సీట్లన్నీ భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తి కాగా… మూడో విడత ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అన్ని విడతలు పూర్తి అయితే… స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
మూడో విడత రిజిస్ట్రేషన్లు చేసుకునే విద్యార్థులు ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 26వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. జూన్ 29వ తేదీన తుది విడుత సీట్లను కేటాయిస్తారు. జూలై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
TS DOST Registration 2024 -రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….
డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించాలి.ఇందులో Candidate Pre-Registrationపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.ముందుగా Application Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి.Candidate Login ద్వారా ఆప్షన్లను ఎంచుకోవచ్చు.మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభమైంది. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసింది. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి ఇతర అప్డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.