TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

6 months ago 131
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet 2024 Results Updates : తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు - 2024

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు - 2024(image source https://eapcet.tsche.ac.in/)

TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీ సెట్‌ - 2024(ఎంసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలవుతుందని అధికారులు ప్రకటించారు.

Sat, 18 May 202406:42 AM IST

టాప్ 10 ర్యాంకర్స్ (అగ్రి స్ట్రీమ్)

1 ర్యాంకు-ప్రణీత(మదనపల్లె)

2వ ర్యాంకు-రాధాకృష్ణ(విజయనగరం)

3వ ర్యాంకు-శ్రీవర్షిణి(హనుమకొండ)

4వ ర్యాంకు-సాకేత్‌ రాఘవ్‌(చిత్తూరు)

5వ ర్యాంకు- సాయి వివేక్‌(హైదరాబాద్‌)

6వ ర్యాంకు-మహమ్మద్‌ అజాన్‌సాద్‌(హైదరాబాద్‌)

7వ ర్యాంకు-వడ్లపూడి ముకేశ్‌ చౌదరి(తిరుపతి)

8వ ర్యాంకు-భార్గవ్‌ సుమంత్‌(హైదరాబాద్‌)

9వ ర్యాంకు-జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్‌)

10వ ర్యాంకు- దివ్యతేజ(శ్రీసత్యసాయి జిల్లా)

Sat, 18 May 202406:41 AM IST

టాప్ 10 ర్యాంకర్స్(ఇంజినీరింగ్)

జ్యోతి రాధిత్య పాలకొండ - శ్రీకాకుళం(ఏపీ)

గోళ్ళలేఖ హర్శ - కర్నూల్(ఏపీ)

రిషి శేఖర్ శుక్ల - తిరుమల గిరి, సికింద్రాబాద్

సందేశ్ - హైద్రాబాద్.

సాయి యశ్వంత్ రెడ్డి - కర్నూల్(ఏపీ)

పుట్టి కుశల్‌ కుమార్‌(అనంతపురం-ఆర్కేనగర్‌)

హుండికర్‌ విదీత్‌(హైదరాబాద్‌-పుప్పాలగూడ)

రోహన్‌(హైదరాబాద్‌)

కొంతేమ్‌ మణితేజ(వరంగల్‌)

ధనుకొండ శ్రీనిధి(విజయనగరం)

Sat, 18 May 202406:18 AM IST

లాస్ట్ ఇయర్ తో పోల్చితే ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. అగ్రికల్చర్, అండ్ ఫార్మసీ,ఇంజనీరింగ్ లో అమ్మాయిలదే హవా కొనసాగింది.

Sat, 18 May 202406:17 AM IST

అబ్బాయిలు - 74.38 శాతం క్వాలిఫైడ్

అమ్మాయిలు - 75.85 శాతం క్వాలిఫైడ్

మొత్తం ఉత్తీర్ణత శాతం - 74.98

Sat, 18 May 202406:17 AM IST

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లో పాస్ శాతం

అబ్బాయిలు 88.25 శాతం క్వాలిఫెయిడ్

అమ్మాయిలు 90.18 శాతం క్వాలిఫైడ్

మొత్తం - 89.66 శాతం

Sat, 18 May 202406:16 AM IST

అగ్రికల్చర్, పార్మసీ టాప్ ర్యాంకర్

1.ప్రణిత - మదనపల్లి

2.రాధా కృష్ణ - విజయనగరం

3.గడ్డం శ్రీ వర్షిణి - హన్మకొండ

4.సాకేత్ రాఘవ్ - చిత్తూరు

5. సాయి వివేక్ - హైద్రాబాద్

Sat, 18 May 202406:15 AM IST

1 జ్యోతి రాధిత్య పాలకొండ - శ్రీకాకుళం

2.గోళ్ళలేఖ హర్శ - కర్నూల్

3.రిషి శేఖర్ శుక్ల - తిరుమల గిరి, సికింద్రబాద్

4.సందేశ్ - హైద్రాబాద్.

5. సాయి యశ్వంత్ రెడ్డి - కర్నూల్

Sat, 18 May 202406:10 AM IST

Sat, 18 May 202406:09 AM IST

ఇంజినీరింగ్, అగ్రి స్ట్రీమ్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు.ఇంజినీరింగ్, అగ్రి స్టీమ్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ ఏపీ విద్యార్థులే సొంతం చేసుకున్నారు.

Sat, 18 May 202406:06 AM IST

కర్నూలు విద్యార్థికి సెకండ్ ర్యాంక్

కర్నూలుకు చెందిన హర్షకు ఎంసెట్ ఫలితాల్లో రెండో ర్యాంక్ దక్కింది.

Sat, 18 May 202406:05 AM IST

ఎంసెట్ ఫలితాల్లో గతేడాదితో పోల్చితే ఈసారి 3 శాతం ఉత్తీర్ణత పెరిందని అధికారులు వెల్లడించారు.

Sat, 18 May 202406:04 AM IST

ఏపీ విద్యార్థికి టాప్ ర్యాంక్

శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్యోతిరాధిత్యకు తెలంగాణ ఈఏపీసెట్ లో ఫస్ట్ ర్యాంక్ దక్కింది.

Sat, 18 May 202406:01 AM IST

తెలంగాణ ఈఏపీసెట్ రాసిన ఏపీ విద్యార్థుల్లో 34 వేల మందికిపైగా అర్హత సాధించారు.

Sat, 18 May 202406:00 AM IST

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో జ్యోతిరాధిత్యకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది.ఇక హర్షకు రెండో ర్యాంక్ దక్కగా…రిషి శేఖర్ శుక్లాకు మూడో ర్యాంక్ దక్కింది.

Sat, 18 May 202405:54 AM IST

తెలంగాణ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమై… 11తో ముగిశాయి. మొత్తంగా ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా... వీరిలో 2,40,617 మంది పరీక్షలు రాశారని అధికారులు వెల్లడించారు. ఇక ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాసినట్లు వివరించారు.

Sat, 18 May 202405:47 AM IST

త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్

ఫలితాల విడుదల తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.

Sat, 18 May 202405:44 AM IST

3 లక్షలకుపైగా విద్యార్థులు

ఈ ఏడాది 3 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి పేర్కొన్నారు.

Sat, 18 May 202405:42 AM IST

జేఎన్టీయూ హైదరాబాద్ లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వివరించారు.

Sat, 18 May 202405:34 AM IST

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి.

Sat, 18 May 202405:11 AM IST

కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్)ఫలితాల విడుదలకు ముహుర్తం సిద్ధమైంది. 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు.

Sat, 18 May 202404:42 AM IST

మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…

-తెలంగాణ ఎంసెట్( ఈఏపీసెట్0 పరీక్ష రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.

- TSEAPCET - Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.

- మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

-ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

-అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

Sat, 18 May 202404:41 AM IST

ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని జేఎన్టీయూలో తెలంగాణ ఎంసెట్(ఈఏపీసెట్) ఫలితాలను వెల్లడించనున్నారు. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Sat, 18 May 202404:07 AM IST

మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు

మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. 11 గంటలకు అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.

Sat, 18 May 202403:10 AM IST

గతేడాది నిర్వహించిన ఎంసెట్ పరీక్షలో ఇంజినీరింగ్‌లో అనిరుధ్‌కు మొదటి ర్యాంకు, వెంకట మణిందర్‌రెడ్డికి రెండో ర్యాంకు దక్కింది. ఉమేశ్‌కు మూడో ర్యాంకు, అభినిత్ -4, ప్రమోద్ కుమార్ రెడ్డి 5, ధీరజ్ కుమార్ -6, శన్వితా రెడ్డి -7, సంజనకు 8వ ర్యాంక్ దక్కింది. ఇక అగ్రికల్చర్ విభాగంలో జశ్వంత్ కు మొదటి ర్యాంక్, వెంకటతేజకి రెండో ర్యాంక్, లక్ష్మి పసుపులాటి మూడో ర్యాంక్ రాగా.. కార్తికేయ రెడ్డికి నాలుగో ర్యాంక్ దక్కింది.

Sat, 18 May 202403:09 AM IST

గతేడా మే 25వ తేదీన తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.

Sat, 18 May 202403:09 AM IST

2023లో జరిగిన తెలంగాణ ఎంసెట్ పరీక్షల వివరాలు చూస్తే…. అగ్రికల్చర్, ఫార్మసీ కలిపి సుమారు 1.05 లక్షల మంది పరీక్షలు రాశారు. వీరిలో 86 శాతం అర్హత సాధించారు, ఇంజినీరింగ్‌లో 80 శాతం అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌లో అబ్బాయిలు 79 శాతం, అమ్మాయిల్లో 82 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Sat, 18 May 202403:01 AM IST

తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Sat, 18 May 202402:25 AM IST

టీఎస్ ఈఏపీ సెట్‌ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి హైదరాబాద్ జేఎన్టీయూహెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు.

Sat, 18 May 202402:04 AM IST

తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

-తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.

-TSEAPCET Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.

-మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

-సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

-ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

-అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

Sat, 18 May 202402:02 AM IST

ఎంత మంది దరఖాస్తు చేశారంటే…?

తెలంగాణ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమై… 11తో ముగిశాయి. మొత్తంగా ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా... వీరిలో 2,40,617 మంది పరీక్షలు రాశారు. ఇక ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

Sat, 18 May 202402:02 AM IST

అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.

Sat, 18 May 202402:01 AM IST

ఈసారి భారీగా దరఖాస్తులు….

మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,54,543 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే, గతేడాదితో పోల్చితే ఈసారి ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు ఎక్కువ మంది అప్లయ్ చేసుకున్నారు.

Sat, 18 May 202402:00 AM IST

ఈఏపీసెట్ ఫలితాల లింక్ ఇదిగో

తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Sat, 18 May 202401:59 AM IST

ఇంజినీరింగ్, పార్మసీ ప్రవేశాలు

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.

Sat, 18 May 202401:59 AM IST

నేడు ఈఏపీ సెట్‌ - 2024 ఫలితాలు

ఇవాళ తెలంగాణ ఈఏపీ సెట్‌ - 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.

Read Entire Article